Movie News

స్టార్ అతిథి లేకపోవడమే కరెక్ట్

ఎల్లుండి జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో చేస్తున్నది కాకపోయినా వీలైనంత మేరకు ఫ్యాన్స్ ని అనుమతిస్తూనే లైవ్ లో చూసే అవకాశం ఇతర మాధ్యమాల ద్వారా ఇస్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు పంచుకునే విశేషాల కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరుకాబోతున్నారు. దేవర కెప్టెన్ గా కొరటాల శివ ఎలాగూ ఉంటారు. తారక్ గురించి వీళ్ళిచ్చే ఎలివేషన్, ఎమోషన్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.

నిజానికి మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ ఎవరో ఒకరు దేవర వేడుకకు రావొచ్చనే ప్రచారం ముందు జరిగింది. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇలాంటి స్టార్ అతిథులు లేకపోవడమే కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ మహేష్ వస్తే అటెన్షన్ మొత్తం తన లుక్స్ పైకి వెళ్తుంది. ఎస్ఎస్ఎంబి 29 కోసం పూర్తిగా మేకోవరైన సూపర్ స్టార్ అంత సేపు పబ్లిక్ స్టేజి మీద కనిపిస్తే మీడియా కవరేజ్ సగం దాని మీదే వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇక బన్నీ వస్తే పుష్ప 2 గురించి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఎంత బావా అని పిలుచుకునే చనువు ఉన్నా అల్లు అర్జున్ ఉన్న బిజీ, సోషల్ మీడియాలో ఏర్పడుతున్న అభిప్రాయాల దృష్ట్యా దూరం ఉండటం మంచిది.

సో తారక్ తో పని చేసిన పని చేయబోతున్న స్టార్ డైరెక్టర్లను తీసుకురావడమే సరైన నిర్ణయం. ఆదివారం కావడంతో ఈవెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 27 ఎంతో దూరంలో లేదు. ఆరు రోజులు గడిచిపోతే గురువారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు మొదలవుతాయి. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ హంగామా ఈసారి మాములుగా ఉండబోదు. పాత సినిమాల రీ రిలీజులకే ఓ రేంజ్ హడావిడి చేస్తున్న ట్రెండ్ లో దేవరకు జరగబోయే రచ్చ ఊహాకందడం కష్టమే.

This post was last modified on September 20, 2024 12:30 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago