నేనే రాజు నేనే మంత్రి లాంటి సక్సెస్ ఫుల్ కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ కొన్ని నెలల క్రితం రాక్షసరాజుని ప్రకటించిన సంగతి తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ ఆ తర్వాత ఎక్కడ షూటింగ్ వెళ్లిన దాఖలాలు కనిపించలేదు. టైటిల్ బాగుంది. మరోసారి పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఎంటర్ టైనర్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో ఎలాంటి అప్డేట్ లేకపోవడం నిరాశ కలిగించింది. పైకి చెప్పలేదు కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని, తేజ కొడుకుని లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడనేది ఓపెన్ సీక్రెట్.
ఇక అసలు విషయానికి వస్తే రాక్షసరాజు కథని విపరీతంగా ఇష్టపడ్డ రానా దాని కథను మాత్రమే తేజ నుంచి తీసుకుని వేరే డెబ్యూ డైరెక్టర్ తో తీయించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పేరు తదితర వివరాలు బయటికి రాలేదు కానీ స్క్రిప్ట్ పనులు అయితే జరుగుతున్నాయట. నిర్మాతగా అభిరుచిని చాటుకుంటున్న రానా తాను హీరోగా నటించబోయే వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగానే తేజతో డ్రాప్ అయ్యాడనే టాక్ ఉంది. అహింస రూపంలో తమ్ముడు అభిరాంకు కనీసం డీసెంట్ గా చెప్పుకునే సినిమా కాకుండా డిజాస్టర్ ఇవ్వడం ఒక కారణం కావొచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. దుర్మార్గులు రాజకీయాల్లోకి రావడం సహజమే కానీ రాక్షస ఆలోచనలున్న వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందిన రాక్షసరాజు స్టోరీ పరంగా బాగుందని యూనిట్ లీక్. రానా ప్రస్తుతం వెట్టయన్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో మొదటిసారి తెరను పంచుకున్న అనుభూతిని అక్టోబర్ 10 దక్కించుకోబోతున్నాడు. నాని వద్దనుకున్న క్యారెక్టరనే టాక్ ముందు నుంచీ ఉంది. ఆ కోణంలో కూడా ఆసక్తి నెలకొంది. అమితాబ్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ ఇతర తారాగణం.
This post was last modified on September 19, 2024 6:26 pm
ఒకప్పుడు ఏ మాయ చేశావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు మనుగడ…
టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి సరైన బాక్సాఫీస్ విజయం లేక ఇబ్బంది పడుతున్న పెద్ద సినీ ఫ్యామిలీస్లో అక్కినేని వారిది…
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా చెబితే అది జరిగేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయన…
గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ దేశవ్యాప్తంగా…
వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే…
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన…