Movie News

టెన్షన్‌గా ఉందన్న ఎన్టీఆర్

ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం అంటే.. ‘దేవర’నే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ రూపొందించాడు. కొరటాల చివరి చిత్రం ‘ఆచార్య’ పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. ఆ ప్రభావం ‘దేవర’ మీద ఉండదనే భావిస్తున్నారు. ముందు నుంచి టీం అంతా కూడా ఈ సినిమా మీద చాలా ధీమాగానే ఉంది. కాకపోతే ఇటీవల రిలీజైన ట్రైలర్ విషయంలో మాత్రం కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ రిలీజ్ ముంగిట హైప్ అయితే తక్కువగా లేదు.

ఐతే తాము అద్భుతమైన సినిమాను అందిస్తున్నామనే ధీమా ఉన్నప్పటికీ.. రిలీజ్ ముంగిట టెన్షన్‌గానే ఉందని ‘దేవర’ ప్రమోషన్లలో భాగంగా జరిపిన ఓ చిట్ చాట్ కార్యక్రమంలో తారక్ చెప్పాడు. “సినిమాపై మేం చాలా నమ్మకంగా ఉన్నాం. టీం అంతా చాలా కష్టపడి పని చేశాం. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది. అయినా సరే.. రిలీజ్ దగ్గర పడుతుంటే టెన్షన్‌గా ఉంది” అని తారక్ అన్నాడు.

ఇక ‘దేవర’ మ్యూజిక్ విషయం కొంచెం మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ తారక్ మాత్రం అనిరుధ్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు. అతను ఏఆర్ రెహమాన్ స్థాయికి చేరుకుంటాడని అన్నాడు. “ప్రస్తుతం అనిరుధ్ శకం నడుస్తోంది. కొంతమంది సక్సెస్ సాధించాక కొంత ఉదాసీనంగా ఉండి ఫెయిలవుతుంటారు. కానీ అనిరుధ్ అలా కాదు. ఒక సినిమాకు ఎలాంటి సంగీతం అవసరమో అతడికి బాగా తెలుసు. జైలర్, విక్రమ్, మాస్టర్ సినిమాల మ్యూజిక్ మెస్మరైజ్ చేసింది. దేవరకు కూడా అద్భుతమైన సంగీతం అందించాడు. అతను రెహమాన్ స్థాయికి వెళ్తాడని నమ్మకంగా చెబుతున్నా” అని ఎన్టీఆర్ అన్నాడు.

‘దేవర’కు ముందు హీరోయిన్‌గా జాన్విని అనుకోలేదని.. కరణ్ జోహారే ఆమె పేరును సూచించాడని.. ఆయన చెప్పాక కూడా తన పేరును ఖరారు చేయడానికి చాలా టైం తీసుకున్నామని.. ఆమె ఈ చిత్రంలో చాలా బాగా నటించిందని తారక్ తెలిపాడు.

This post was last modified on September 19, 2024 6:20 pm

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

33 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

5 hours ago