గత రెండు దశాబ్దాల్లో తెలుగులో అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా దిల్ రాజే నిలుస్తారేమో. దిల్ లాంటి హిట్ మూవీతో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టిన రాజు.. ఎక్కడా వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో బ్లాక్‌బస్టర్లు, క్లాసిక్‌లతో నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే ఆయన అప్పుడప్పుడూ కొత్త కాంబినేషన్లలో కొన్ని చిన్న సినిమాలు నిర్మిస్తుంటారు. ఈ కోవలోనే రాజు నుంచి ఒక ఆశ్చర్యకర చిత్రం వస్తోంది. ఆ సినిమా పేరు.. షాదీ ముబారక్.
మొగలి రేకులు సీరియల్‌తో సూపర్ పాపులారిటీ సంపాదించి.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరో ఫ్రెండుగా కనిపించి.. ఆ తర్వాత సిద్దార్థ అనే సినిమా కూడా చేసిన ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ ఈ చిత్రంలో కథానాయకకుడగా నటిస్తుండటం విశేషం. మలయాళీ అమ్మాయి దృశ్య రఘునాథ్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. పద్మశ్రీ అనే కొత్త లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించింది. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చగా శ్రీకాంత్ నరోజ్ ఛాయాగ్రాహకుడు. మొత్తంగా ఈ టీంను చూస్తే ఎవరూ పేరు లేని వాళ్లే. చాలా వరకు కొత్తవాళ్లే. ఈ టీంను నమ్మి దిల్ రాజు లాంటి నిర్మాత సినిమాను నిర్మించాడంటే విశేషమే. బుధవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతోంది. దీని రేంజ్ చూస్తే ఓటీటీ రిలీజ్ టార్గెట్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on September 29, 2020 9:38 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…