Movie News

జైలులో 100 రోజుల సినిమా

మాములుగా సినిమాలు శతదినోత్సవాలు చేసుకుంటే అభిమానులకు అదో పండగ. ఎన్ని ఎక్కువ సెంటర్లలో ఆడితే అంత గర్వంగా చెప్పుకుంటారు. కానీ శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ మాత్రం జైల్లో ఊచలు లెక్కబెట్టడంలో 100 రోజులు పూర్తి చేసుకోవడం కొత్త సెన్సేషన్. స్వంత అభిమాని రేణుకస్వామి హత్య కేసులో విచారణ ఎదురుకుంటున్న దర్శన్ తో పాటు ఏ1గా ఉన్న అతని ప్రియురాలు పవిత్ర గౌడతో సహా సహ నిందితులందరూ ఈ మైలురాయిని చేరుకున్నారు. కన్నడ సీమలో ఇంత సుదీర్ఘంగా కారాగారంలో ఉన్న హీరోగా దర్శన్ కొత్త రికార్డు సృష్టించాడని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

దర్శన్ కు ఇంకా బెయిల్ దొరకలేదు. ఇటీవలే బెంగళూరు హై కోర్టు జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 30 వరకు పొడిచింది. రాజధాని జైలులో సకల భోగాలు అందుతున్నాయన్న అభియోగం మీద ఇతన్ని బళ్లారికి షిఫ్ట్ చేశారు. అక్కడ మాములు ఖైదీగానే ట్రీట్ చేస్తున్నారు. పోలీసులు బలమైన సాక్ష్యాధారాలు సేకరించడంతో దర్శన్ చుట్టూ బలమైన ఉచ్చు బిగుసుకుంది. డబ్బు పలుకుబడి ఏదీ పనిచేయనంత ఊబిలో ఇరుక్కుపోయాడు. ఇంకోవైపు ఫ్యాన్స్ మాత్రం తమ హీరో దోషినో కాదో తేలేవరకు తప్పుని ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు. ఈ మూడు నెలల్లో ఇతని రీ రిలీజ్ సినిమాలు చాలానే వచ్చాయి.

జూన్ 11 జిమ్ చేస్తున్న దర్శన్ ని అరెస్ట్ చేశాక ఇప్పటిదాకా బయటి ప్రపంచంలోకి రాలేదు. నిర్మాణంలో ఉన్న అతని ప్యాన్ ఇండియా మూవీ డెవిల్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీని మీద అప్పటిదాకా పెట్టిన పెట్టుబడి, అడ్వాన్సులు, ఆర్టిస్టుల కాల్ షీట్లు, ప్రొడక్షన్ కాస్ట్ రూపంలో కోట్లలో నష్టపోవాల్సి వస్తోందని నిర్మాత వాపోతున్నారు. గతంలో సంజయ్ దత్ తరహాలో బ్యాలన్స్ ఉన్న షూటింగుల్లో పాల్గొనే అవకాశం ఇచ్చేలా ఏదైనా తీర్పు వస్తుందేమోనన్నీ ఎదురు చూస్తున్నారు. ఏం చేసినా చెల్లుతుందనే అహంకారానికి ఎలాంటి పరిస్థితి వస్తుందో దర్శన్ ఉదంతమే పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.

This post was last modified on September 19, 2024 2:30 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

3 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

3 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

3 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

6 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

6 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

8 hours ago