రాజమౌళి కుటుంబం నుంచి వచ్చాడనే పేరు, కీరవాణి వారసుడనే బ్రాండ్ హీరోగా శ్రీసింహకు తొలినాళ్లలో ఉపయోగపడ్డాయి కానీ అతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడలేదు. కారణం సక్సెస్ రేట్ లేకపోవడమే.
మత్తు వదలరాతో సూపర్ డెబ్యూ అందుకున్నప్పటికీ తర్వాతి సినిమాలు కనీస స్థాయిలో మెప్పించలేక చతికిలబడ్డాయి. తెల్లవారితే గురువారం వచ్చిన సంగతే మూవీ లవర్స్ మర్చిపోగా దొంగలున్నారు జాగ్రత్త వెనుక పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ లాభం లేకపోయింది . భాగ్ సాలే టైటిల్ కు తగ్గట్టే ప్రేక్షకులను పరిగెత్తిస్తే ఉస్తాద్ కు కాసిన్ని క్రిటిక్స్ ప్రశంసలు తప్ప డబ్బులు రాలేదు.
ఇంత గ్యాప్ తర్వాత మత్తు వదలరా 2తో శ్రీసింహకో హిట్టు పడింది. ఇది సంతోషించాల్సిన విషయమే కానీ సింహ భాగం క్రెడిట్ కమెడియన్ సత్య అకౌంట్ లోకి వెళ్లిపోవడంతో పేరుకి హీరోనే అయినా శ్రీసింహకు ఒరిగింది పెద్దగా లేదనే కామెంట్స్ ఆడియన్స్ నుంచే వినిపిస్తున్నాయి. నటన పరంగా తను మెరుగయ్యాడు.
ఎక్స్ ప్రెషన్లు మునుపటి కంటే బాగా పలుకుతున్నాయి. కానీ ఈ టాలెంట్ అంతా సత్య ఓవర్ షాడో చేసేశాడు. మత్తు వదలరా 2 ఎందుకు చూడాలనే కారణానికి వన్ అండ్ ఒన్లీ రీజన్ అయిపోయాడు. దీంతో శ్రీసింహకు ఆనందం, అయోమయం రెండూ కలిగాయి.
సోలోగా తనకు పెద్ద బ్రేక్ ఇచ్చే సినిమా వస్తేనే మార్కెట్ పరంగా ఏదైనా ఆశించవచ్చు. తండ్రి ఆస్కార్ విజేత అయినప్పటికీ సంగీతం వైపు కాకుండా యాక్టింగ్ ని సీరియస్ గా తీసుకున్న శ్రీసింహ కాలభైరవ లాగా మ్యూజిక్ డైరెక్షన్ జోలికి వెళ్లడం కన్నా నటుడిగా ఎదగడం మీద దృష్టి పెడుతున్నాడు.
బాలనటుడిగా జక్కన్న తీసిన యమదొంగ, మర్యాదరామన్నలో కనిపించిన శ్రీసింహ ఈగలో సమంతా కొలీగ్ గా నటించాడు. తర్వాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ దేంట్లోనూ ఈ కుర్రాడు లేడు. స్వంతంగా ఎదగాలని చూస్తున్న ఈ యూత్ హీరోకి మంచి ఎంటర్ టైనింగ్ సబ్జెక్టు పడితేనే కోరుకున్న బ్రేక్ దక్కుతుంది.
This post was last modified on September 18, 2024 7:03 pm
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…