బాలీవుడ్ హీరోయిన్లు దక్షిణాది సినిమాల్లో నటించిన సందర్భాల్లో ఆయా చిత్రాల ప్రమోషనల్ ఈవెంట్లకు వస్తే.. పొడి పొడిగా లోకల్ భాషలో రెండు ముక్కలు మాట్లాడడం చూస్తుంటాం. ఆ రెండు మూడు ముక్కలు మాట్లాడ్డమే గొప్ప అని ఫీలవుతుంటారు. దక్షిణాది మూలాలున్న వాళ్లు కూడా ఇక్కడి భాషలు మాట్లాడే ప్రయత్నం పెద్దగా చేయరు. కానీ తాను ఆ కోవకు చెందనని చాటుతోంది జాన్వి కపూర్.
తెలుగమ్మాయి అయిన శ్రీదేవి తనయురాలు అయిన జాన్వి.. తన మూలాలను మరిచిపోలేదని అనిపిస్తోంది. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న జాన్వి.. ఈ చిత్రాన్ని తమిళంలో ప్రమోట్ చేయడానికి చెన్నైకి వెళ్ళింది. అక్కడ స్పష్టమైన తమిళంలో మాట్లాడి తమిళులను పడేసింది. తన ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లోనే మొదలుపెట్టినప్పటికీ.. ఎక్కువ గ్యాప్ లేకుండా తమిళంలోకి వెళ్లిపోయింది.
తమిళంలో మాట్లాడ్డం మొదలుపెట్టగానే ఏవో రెండు మూడు మాటలు బట్టీ కొట్టుకుని వచ్చి ఉంటుందని అనుకున్నారు విలేకరులు. కానీ ఆమె స్పష్టంగా తమిళంలోనే ఒక్కో వాక్యం పూర్తి చేస్తూ వెళ్లింది. తనకు చెన్నై ఎంత స్పెషలో ఆమె వివరించింది. చిన్నతనంలో తన తల్లితో ఉన్న మంచి జ్ఞాపకాలన్నీ చెన్నైతో ముడిపడినవే అని.. తనకిప్పుడు ఇంటికి తిరిగొచ్చినట్లు అనిపిస్తోందని.. ఆమెకు ఈ ప్రాంతం చాలా స్పెషల్ అని జాన్వి చెప్పుకొచ్చింది. తన తల్లిని ఇక్కడి వాళ్లు ఎంతో ఆదరించారని.. తనకు కూడా అలాంటి ప్రేమనే పంచాలని ఆమె కోరింది. చాలా వినమ్రంగా, ఏ తడబాటూ లేకుండా చక్కటి తమిళంలో జాన్వి మాట్లాడడంతో భాషాభిమానం ఎక్కువగా ఉండే తమిళ జనాలు ఫిదా అయిపోయారు.
శ్రీదేవి తెలుగమ్మాయే అయినా ఆమె చాలా ఏళ్లు చెన్నైలోనే ఉంది. అందుకే పిల్లలకు కూడా తమిళం నేర్పినట్లుంది. ఆమె తెలుగు కూడా ఆటోమేటిగ్గా బాగానే నేర్పి ఉంటుంది. కాబట్టి ‘దేవర’ తెలుగు వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి ఇక్కడి వాళ్లను కూడా పడేయడం ఖాయమేమో.
This post was last modified on September 18, 2024 9:48 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…