Movie News

ఒక్కడిగా వస్తేనే కంగువకు లాభం

ఏదో దసరాకు మంచి డేట్ దొరికిందని అక్టోబర్ 10 లాక్ చేసుకుంటే రజనీకాంత్ వెట్టయన్ ఇచ్చిన షాక్ కి వాయిదా వేసుకున్న కంగువ బృందం ఇంకా విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ వైపు చూస్తోంది కానీ అంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి అది సరైన సీజన్ కాదనే అనుమానంతో విడుదల తేదీని ప్రకటించడంలో జాప్యం చేస్తోంది. ఒకవేళ చివరి నిమిషం ఒత్తిళ్ల వల్ల పుష్ప 2 కనక డిసెంబర్ నుంచి తప్పుకుంటే ఆ అవకాశాన్ని వాడుకోవడం మంచి ఆలోచనే కానీ సుకుమార్, అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో వేరొకరికి ఆ ఛాన్స్ ఇచ్చే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి.

కంగువ ఇంతగా మీనమేషాలు లెక్కబెట్టడానికి కారణం లేకపోలేదు, దీని మీద భారీ పెట్టుబడులు జరిగాయి. తెలుగు థియేట్రికల్ హక్కుల నుంచి సుమారు 45 కోట్లు ఆశిస్తుండగా ఇంకా ఒప్పందాలు కొలిక్కి రాలేదు. హిందీ డబ్బింగ్ ఏకంగా 100 కోట్ల ధర చెబుతుండటం వల్ల రికవరీ అంత సులభంగా ఉండదు. కేవలం తమిళ వెర్షన్ ని మాత్రమే చూసుకుంటే 200 కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవర్సీస్ సైతం 50 కోట్ల దాకా టార్గెట్ ఉందట. ఇక డిజిటల్, ఆడియో హక్కులు వేరే. ఇదంతా వెనక్కు రావాలంటే కనీసం మూడు వందల కోట్లకు పైగా షేర్ వస్తేనే సాధ్యమవుతుంది.

సో ఎలాంటి పోటీ లేకుండా రావడం కంగువకు చాలా అవసరం. డిసెంబర్, జనవరిలో ఛాన్స్ లేదు కాబట్టి నవంబర్ 15 ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్టు చెబుతున్నారు. క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగి చూడాల్సిందే. యువి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కంగువ మీద నిర్మాత జ్ఞానవేల్ రాజా ఉన్నదంతా పెట్టారనే టాక్ చెన్నై వర్గాల్లో ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారట. టీజర్ కి మంచి స్పందన వచ్చినప్పటికీ అమాంతం హైప్ పెరిగేలా లేకపోవడంతో ఇంకో ట్రైలర్ కట్ సిద్ధం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న కంగువలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.

This post was last modified on September 17, 2024 7:15 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

2 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

5 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

5 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

7 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

9 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

9 hours ago