నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ ముందున్న అతి పెద్ద సమస్య విడుదల తేదీ. ఎప్పుడో నెలల క్రితం డిసెంబర్ 20 ప్రకటించుకున్నారు. తీరా చూస్తే గేమ్ ఛేంజర్ అదే డేట్ మీద కన్నేయడంతో ఖచ్చితంగా తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పోనీ సంక్రాంతికి వద్దామా అంటే రెండు సమస్యలున్నాయి. చిరంజీవి విశ్వంభర జనవరి 10 వస్తుంది. బావకు పోటీగా తండేల్ సమర్పకుడు అల్లు అరవింద్ రిస్క్ చేయలేరు. ఇది కాకుండా బాలయ్య 109, వెంకీ రావిపూడి 3, అజిత్ సినిమాలున్నాయి. సో థియేటర్లను పంచుకుని ఇబ్బంది పడటం కష్టం.
దీంతో మధ్యేమార్గంగా జనవరి 25 లేదా 26 విడుదల చేసే దిశగా టీమ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. ఓటిటి ఒప్పందం ఎప్పుడో అయిపోయింది. దాని ప్రకారం థియేట్రికల్ రిలీజ్ ఎక్కువ ఆలస్యం చేయడానికి లేదు. అందుకే షూటింగ్ ఆపకుండా నిర్విరామంగా చేస్తున్నారు. వాఘా బోర్డర్ లో ఇటీవలే ఒక కీలక ఎపిసోడ్ చిత్రీకరించారు. చైతు ఈ ప్రాజెక్టు కోసం ప్రీ ప్రొడక్షన్ దగ్గరి నుంచే చాలా కష్టపడ్డాడు. సోలోగా వస్తేనే ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి రీచ్ బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే నిర్మాత బన్నీ వాస్ అన్ని కోణాల్లో విశ్లేషణలు చేసుకునే పనిలో ఉన్నారని తెలిసింది.
ఒకవేళ రిపబ్లిక్ డేనే ఎంచుకుంటే తండేల్ కు అది బెస్ట్ సీజన్ అవుతుంది. ఎందుకంటే అప్పటికంతా సంక్రాంతి జోరు తగ్గిపోయి ఉంటుంది. రెండు వారాలు తగినంత సమయం కాబట్టి జనాలు వాటిని చూసే ఉంటారు. ఏదైనా ఫ్లాప్ అయిన పక్షంలో వాటికిచ్చిన స్క్రీన్లు ఖాళీ అవుతాయి. బాలీవుడ్ లోనూ పోటీ లేదు కాబట్టి నార్త్ లోనూ మార్కెటింగ్ చేసుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన తండేల్ లో సాయిపల్లవి నటన మరోసారి కట్టిపడేసేలా ఉంటుందని అంటున్నారు. గతంలో చైతుతో తను నటించిన లవ్ స్టోరీ హిట్టయిన నేపథ్యంలో ఫలితం కూడా రిపీటవుతుందని ఫ్యాన్స్ నమ్మకం.
This post was last modified on September 17, 2024 11:17 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…