Movie News

ఒళ్ళు గగుర్పొడిచే హత్యలతో ‘సెక్టార్ 36’

సైకో కిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే చూస్తాం కానీ కొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటే అవి నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసినదని తెలిస్తే పీడకలలుగా మారడం ఖాయం.

తాజాగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో పాటు రిలీజైన సెక్టార్ 36 అదే కోవలోకి వస్తుంది. 10త్ ఫెయిల్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో రూపొందిన ఈ క్రైమ్ డ్రామా మీద భారీ అంచనాలున్నాయి. రెండు గంటల నిడివితో రూపొందిన సెక్టార్ 36 మీద ఇంత బజ్ రావడానికి కారణం ఒకప్పుడు దేశాన్ని భయానికి గురి చేసిన సంఘటనని తీసుకుని రూపొందించడమే.

2006 సంవత్సరం. నోయిడా దగ్గరున్న నిఠారి గ్రామంలో వరసగా చిన్న పిల్లలు కిడ్నాప్ కు గురవుతూ ఉంటారు. టీనేజ్ వయసు కాబట్టి తల్లితండ్రులతో గొడవ పడి వెళ్ళిపోయి ఉంటారని పోలీసులు నిర్లక్ష్యం చేస్తారు. అయితే కొన్నిరోజుల తర్వాత చనిపోయిన పిల్లల శరీర భాగాలు మురికి కాలువలో దొరుకుతాయి.

ఈ హత్యలకు అదే ప్రాంతంలో ఉండే ఒక ధనవంతుడు, అతని పనిమనిషి ప్రేమ్ (విక్రాంత్ మాసే)కు సంబంధం ఉందనేందుకు ఆధారాలు దొరుకుతాయి. దొరికిపోయాక ప్రేమ్ నిర్భయంగా నేరాన్ని అంగీకరిస్తాడు. అసలు ట్విస్టులు, కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది. అది సినిమాలోనే చూడాలి.

పిల్లలను చంపి వాళ్ళ శరీర భాగాలతో వ్యాపారం చేయడమనే వివాదం మీద నిఠారి సీరియల్ కిల్లింగ్స్ కేసు ఏళ్ళ తరబడి కోర్టులో నడిచింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ని సైతం దారుణంగా గొంతు కోసి చంపినట్టు సెక్టార్ 36లో చూపించారు. దీన్ని బట్టే ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ జరిగాయో అర్థం చేసుకోవచ్చు.

నిడివి తక్కువ కాబట్టి చాలా విషయాలను క్లుప్తంగా చూపించారు కానీ అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వెనుక పెద్ద చరిత్ర ఉంది. ఇంత జరిగినా సరైన ఎవిడెన్స్ లేదనే కారణంతో నిందితుల మీద నేరం ఋజువు కాకపోవడం అసలు ట్రాజెడీ. సున్నిత మనస్కులు సెక్టార్ 36కి దూరం ఉండటం బెటర్.

This post was last modified on September 14, 2024 6:25 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago