సినిమాల ప్రమోషన్లు రోజు రోజుకూ కొంత పుత్తలు తొక్కుతున్నాయి. ఒక మూసలో సాగిపోతే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టం కాబట్టి.. ఎప్పటికప్పుడు కొత్త బాటలో సాగుతూనే ఉన్నాయి చిత్ర బృందాలు. సినిమాల రిలీజ్ ముంగిట నటీనటులు, టెక్నీషియన్లు మీడియా ప్రతినిధులకు వీడియో ఇంటర్వ్యూలు ఇవ్వడం మామూలే. దీంతో పాటుగా సుమ లాంటి పేరున్న యాంకర్లు కామన్ ఇంటర్వ్యూలు చేయడం ఇంకో స్టైల్.
ఐతే ఈ మధ్య సినిమా వాళ్లే ఇంటర్వ్యూలు చేయడం కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ టైంలో అనిల్ రావిపూడి.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత మరిందరు ఈ బాటలో సాగారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీర్ కొత్త సినిమా దేవర ప్రమోషన్లలో భాగంగా ఇద్దరు యువ కథానాయకులు తారక్, దర్శకుడు కొరటాల శివను ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఆ ఇద్దరు హీరోలే.. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్.
తారక్‌ను సిద్ధు, విశ్వక్ ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు కొన్ని రోజుల ముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడా విషయం ఖరారైంది. తారక్, కొరటాల మధ్యలో కూర్చోగా.. ఇటు అటు సిద్ధు, విశ్వక్ కూర్చుని వారిని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో తాలూకు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలోకి వచ్చింది. స్వయంగా దేవర టీమే దీన్ని పంచుకుంది. దీంతో ఈ ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో బజ్ మొదలైంది. సిద్ధు, విశ్వక్ ఇద్దరూ ఎన్టీఆర్‌కు బాగా క్లోజ్. ఒక రకంగా అభిమానులు అని కూడా చెప్పాలి. వారి సినిమాల ఈవెంట్లకు కూడా తారక్ అతిథిగా వెళ్లాడు. ఇప్పుడు తారక్ సినిమా కోసం వాళ్లిద్దరూ ప్రమోషన్ల పరంగా సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
సిద్ధు, విశ్వక్ ఇద్దరూ మంచి మాటకారులు, ట్రెండీగా ఉంటారు కాబట్టి కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చాలా క్రేజీగా, ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఒకట్రెండు రోజుల్లో ఇంటర్వ్యూ వీడియో రిలీజయ్యే అవకాశముంది.
This post was last modified on September 14, 2024 2:14 pm
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…