50 రోజులు.. మూడు డిజాస్టర్లు

కాస్త పేరున్న హీరో సినిమాలు 50 రోజుల వ్యవధిలో మూడు రిలీజ్ కావడమే అరుదు. ఆ మూడు కూడా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ కావడం ఇంకా అరుదు. ఈ అన్ వాంటెడ్ రికార్డునే మూటగట్టుకున్నాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఎప్పుడో కెరీర్ ఆరంభంలో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్‌ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి మంచి డిమాండ్ తెచ్చుకున్న ఈ కుర్రాడు.. ఆ తర్వాత ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేశాడు.

కానీ ఆ చిత్రాలేవీ అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఒక దశ దాటాక అతడి ఫ్లాపుల్ని లెక్కగట్టడం కూడా మానేశారు ప్రేక్షకులు. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చిన అతను.. గత 50 రోజుల్లో మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూడు కూడా తీవ్ర నిరాశనే మిగిల్చాయి రాజ్‌కు.

లావణ్య చౌదరితో వ్యక్తిగత వివాదం కారణంగా రాజ్ పేరు మీడియాలో బాగా నానుతున్న టైంలో జులై 26న అతడి ‘పురుషోత్తముడు’ సినిమాను సడెన్‌గా థియేటర్లలోకి దించారు. ‘శ్రీమంతుడు’కు నకలులా అనిపించిన ఆ చిత్రం మినిమం ఇంపాక్ట్ వేయకుండా వెళ్లిపోయింది. ఇంకో వారం రోజులకే ‘తిరగబడరా సామీ’ అంటూ మరో సినిమాతో పలకరించాాడు రాజ్. ముందు వచ్చిన సినిమానే కాస్త నయం అనిపించిందీ మూవీ. మరీ దారుణమైన రివ్యూలు, టాక్ రావడంతో సినిమా అడ్రస్ లేకుండా పోయింది.

ఆ తర్వాత 40 రోజులు గ్యాప్ ఇచ్చి లేటెస్ట్‌గా ‘భలే ఉన్నాడే’ సినిమాతో వచ్చాడు రాజ్. మారుతి ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించడం, ట్రైలర్ కొంత ఆకర్షణీయంగా ఉండడంతో ఇదైనా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో అనుకున్నారు. ఐతే అడల్ట్ టచ్ ఉన్న ఈ కాన్సెప్ట్ వినడానికి బాగున్నా.. ఎగ్జిక్యూషన్ తేలిపోవడంతో ప్రేక్షకులు చివరి వరకు థియేటర్లో కూర్చోలేని పరిస్థితి తలెత్తుతోంది. రాజ్ గత చిత్రాలతో పోలిస్తే బెటర్ అంటున్నారే తప్ప.. ఇది కూడా శిరోభారం కలిగించే సినిమానే అని తేల్చేస్తున్నారు. దీంతో 50 రోజుల వ్యవధిలో రాజ్ ఖాతాలో మూడు డిజాస్టర్లు పడ్డట్లయింది. ఈ స్థితి నుంచి అతనెలా కోలుకుంటాడో చూడాలి మరి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

2 hours ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

3 hours ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

3 hours ago

డేటింగ్ రూమర్స్‌పై VD మరో క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…

3 hours ago

‘హరి హర వీరమల్లు’ నుంచి క్రిష్ తో పాటు ఆయన కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

3 hours ago