కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం రూపంలో డిజాస్టర్ చూశాక అందరి చూపు అతను చేయబోయే రాజకీయం వైపు వెళ్తోంది. దీనికన్నా ముందు ఇంకొక్క చివరి సినిమా చేస్తానని కమిటవ్వడంతో దాని మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. యష్ తో టాక్సిక్ నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో హెచ్ వినోత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఇది రూపొందనుంది. తలపతి 69గా ప్రచారంలోకి వచ్చిన ఈ ప్రాజెక్టు తాలూకు అనౌన్స్ మెంట్ ఇవాళ జరగనుంది. పొలిటికల్ టచ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందట.
సరే బాగానే ఉంది కానీ నిజంగా విజయ్ చివరి సినిమా ఇదే అవుతుందా అంటే నిస్సందేహంగా నో అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే గతంలో ఇలా చెప్పి తిరిగి మేకప్ వేసుకున్న స్టార్లు ఎందరో ఉన్నారు. కమల్ హాసన్ ఇంతకన్నా ఆవేశంగా పార్టీ స్థాపించి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయకుండానే బ్యాక్ టర్న్ తీసుకుని కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ప్రజారాజ్యం టైంలో శంకర్ దాదా జిందాబాద్ చిరంజీవి చివరి చిత్రంగా ప్రచారం చేశారు. కట్ చేస్తే ఖైదీ నెంబర్ 150 నుంచి మళ్ళీ కొనసాగుతున్నారు. అజ్ఞాతవాసి సమయంలో పవన్ కళ్యాణ్ చేసింది ఇదే. వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు.
సో విజయ్ సినిమాలు చేయడం చేయకపోవడం రాజకీయపరంగా జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదంత ఈజీ కాదు. పవన్ డిప్యూటీ సిఎం స్థాయికి చేరుకోవడానికి సింగల్ డిజిట్ అవమానాల నుంచి క్లీన్ స్వీప్ విజయం దాకా ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవాల్సి వచ్చింది. అంత స్టామినా ఉంటేనే విజయ్ నిలదొక్కుకోగలడు. స్టాలిన్ సర్కారుని ఫేస్ చేయడం సులభం కాదు. పైగా కోట్లాది ఫ్యాన్స్ ఉన్నా సరే వాళ్ళందరూ ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదు. చరిత్రలో ఎన్నోసార్లు ఋజువయ్యింది. సో విజయ్ ని తెరమీద మళ్ళీ మళ్ళీ చూడలేం అనేది ఖచ్చితంగా చెప్పలేం.
This post was last modified on September 13, 2024 3:26 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…