ఇప్పుడు తెలుగు అనే కాదు.. మొత్తంగా భారతీయ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం.. దేవర. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజే ఉంది. హిందీలో కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో అక్కడా మంచి మార్కెటింగే జరుగుతోంది. సెప్టెంబరు 27న ఇండియన్ బాక్సాఫీస్‌ను ఈ సినిమా షేక్ చేస్తుందనే అంచనాలున్నాయి.
ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. సినిమాకు ఓపెనింగ్స్ విషయంలో ఢోకా ఉండదని.. కొరటాల శివ ఈ సారి తన కసినంతా చూపిస్తాడని.. బ్లాక్ బస్టర్ అందిస్తాడని తారక్ అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. ఐతే ఈ సినిమా నిడివి పరంగా కొంత రిస్క్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఏకంగా మూడు గంటల పాటు ప్రేక్షకులు థియేటర్లో కూర్చోవాల్సి ఉంటుంది.
విడుదలకు రెండు వారాల ముందే ‘దేవర’కు సెన్సార్ పూర్తి చేశారు. నాలుగు కట్స్‌తో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు. రన్ టైం 2 గంటల 58 నిమిషాలు అని వెల్లడైంది. విషయం ఉంటే.. నిడివి అన్నది పెద్ద సమస్య కాదు. ఇటీవల ‘కల్కి’ దాదాపు మూడు గంటల నిడివితోనే మెప్పించింది. గత ఏడాది ‘యానిమల్’ దాదాపు మూడున్నర గంటల రన్ టైంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కోవలో చెప్పడానికి చాలా సినిమాలే ఉన్నాయి.
ఐతే సినిమాలో కంటెంట్ వీక్‌గా ఉంటే నిడివి అన్నది పెద్ద సమస్య అయిపోతుంది. రిలీజ్ తర్వాత కోతలు వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి అన్నీ చూసుకునే కొరటాల అండ్ కో ఈ రన్ టైంను ఫైనల్ చేసి ఉంటుందని భావించాలి. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, తారక్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 13, 2024 3:22 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…