‘బిగ్‍బాస్’ నుంచి నిజంగా ఓటింగ్ పరంగానే ఎలిమినేషన్లు జరుగుతాయా అనే ప్రశ్న దేవి నాగవల్లి ఎలిమినేషన్‍తో మరోసారి తెర మీదకు వచ్చింది. అనధికారిక పోల్స్ లో దేవి నాగవల్లికి క్లియర్‍గా మెహబూబ్‍పై లీడ్ దక్కింది. ఓటింగ్ శాతం పరంగా కూడా దేవి నాగవల్లికే ఎడ్జ్ వచ్చిందని, అయితే చివరి నిమిషంలో బిగ్‍బాస్ షో కమర్షియల్ లెక్కలు కన్సిడర్ చేసి మెహబూబ్‍కి బదులుగా దేవిని పంపించేసారని ఒక టాక్ వినిపిస్తోంది. అందులో నిజమెంత అనేది దేవి ఇంటర్వ్యూలు మొదలయితే కానీ తెలియదు. కానీ దేవి ఎలిమినేషన్ పట్ల చాలా మంది ఆగ్రహంతో వున్నారని సోషల్ మీడియా రియాక్షన్స్ లోనే తెలుస్తోంది.
బిగ్‍బాస్ గేమ్‍ని దేవిలా జెన్యూన్‍గా సూటిగా, సుత్తి లేకుండా ఆడే వాళ్లకు ఎక్కువ రోజులు వుండనివ్వరా అనేది చాలా మంది సంధిస్తోన్న సూటి ప్రశ్న. అమ్మాయిలయితే గ్లామర్ పండించాలి. అబ్బాయిలయితే అమ్మాయిల వెంట పడుతూ పులిహోర కలపాలి అన్న రీతిన బిగ్‍బాస్ షో నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోబోలు, మనుషుల టాస్క్ లో మెహబూబ్ ఆవేశంతో రెచ్చిపోయి, ఆ తర్వాత ఏడ్చేసి ఒక పెద్ద షోనే చేసాడు. అంతే కాకుండా షోలో నిలబడాలంటే అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకోవాలంటూ స్టేట్‍మెంట్ కూడా ఇచ్చాడు.
ఇదంతా బిగ్‍బాస్ టీమ్‍కి అతడి నుంచి పోను పోను మంచి కంటెంట్ వస్తుందనే నమ్మకాన్ని పెంచడం వలన సిన్సియర్‍గా గేమ్ ఆడుతోన్న దేవిని పంపించేసి అతనికో అవకాశం ఇచ్చారనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. బిగ్‍బాస్ హౌస్‍లో ఎలా వుండాలనే దానిపై ఒక వారం గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున తర్వాతి వారానికి మెత్తబడిపోవడం కూడా ఆడియన్స్ కు నచ్చట్లేదు.
హద్దు మీరి ప్రవర్తించిన సోహైల్, మెహబూబ్, మోనల్, అఖిల్ ఎవరికీ క్లాస్ తీసుకోకుండా సింపుల్‍గా బాగా ఆడారంటూ ఒక మాట చెప్పి ఆట పాటలతో వీకెండ్ కానిచ్చేసారు. సరిగ్గా గాడిన పడుతోందని జనం అనుకుంటోన్న టైమ్‍లో మరోసారి బిగ్‍బాస్ టీమ్ యాక్సలరేటర్ పైనుంచి కాలు తీసేసారు.
This post was last modified on September 29, 2020 4:52 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…