టీజర్.. ట్రైలర్లలో చిన్న హింట్స్ ఇస్తే చాలు.. సోషల్ మీడియా జనాలు కథ మొత్తం అల్లేసే రోజులు ఇవి. అందులోనూ పెద్ద హీరో నటించిన, భారీ అంచనాలున్న సినిమాల విషయంలో అయితే సోషల్ మీడియా విశ్లేషణలు మామూలుగా ఉండవు.
సినిమాలోని ట్విస్టుల మీద కూడా రకరకాల థియరీస్ తీసుకొచ్చి ఆయా చిత్ర బృందాలు కూడా షాకైపోయేలా విశ్లేషణలు చేసేస్తుంటారు నెటిజన్లు. ఇటీవలే లాంచ్ అయిన ‘దేవర’ ట్రైలర్ విషయంలో కూడా ఇలాంటి అనాలసిస్‌లు చాలానే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఈ సినిమా కథ ఇదే అంటూ బోలెడంత మంది తమ క్రియేటివిటీని చూపించేస్తున్నారు. అంతే కాక సినిమాలో మేజర్ ట్విస్ట్ గురించి కూడా ఒక ఆసక్తికర థియరీ ప్రచారంలో ఉంది.
ట్రైలర్ ప్రకారం సినిమాలో పెద్ద దేవర సముద్రంలోనే అజ్ఞాతంలో ఉంటూ తప్పు చేయాలని చూసే తమ తెగ వాళ్లను మట్టు పెడుతుంటాడు. కానీ తన కొడుకైన చిన్న దేవర మహా పిరికివాడిగా ఉంటూ తండ్రిని అసహ్యించుకుంటూ ఉంటాడు.
కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. పెద్ద దేవర అనేవాడు చనిపోయి ఉంటాడు. అజ్ఞాతంలో ఉన్నాడన్నది అబద్ధం. పైకి పిరికివాడిగా కనిపించే చిన్న దేవరనే తండ్రి రూపంలో కనిపిస్తూ తప్పు చేయాలనుకునేవాళ్లకు బుద్ధి చెబుతుంటాడు.
ఈ విషయం సినిమా చివర్లో రివీలవుతుంది. ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అవుతుంది. పార్ట్-2లో అతను తన తండ్రిని చంపిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో కథ నడుస్తుంది అని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ ట్విస్ట్ గురించిన థియరీస్ ఇప్పటికే బాగా పాపులర్ అయిపోయాయి.
రేప్పొద్దున సినిమాలో ఇదే చూపించినా పెద్దగా సర్ప్రైజ్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. మరి ప్రేక్షకులు ట్రైలర్ చూసి ఇంత ఈజీగా గెస్ చేసే స్థాయిలోనే ట్విస్ట్ ఉంటుందా.. లేక కొరటాల శివ ప్రేక్షకుల అంచనాలను మించి సినిమాలో ఇంకేదైనా చూపిస్తాడా.. సోషల్ మీడియాలో ఈ ప్రచారం సాగిస్తున్న జనాలకు తనే ట్విస్ట్ ఇస్తాడా అన్నది చూడాలి.
This post was last modified on September 13, 2024 12:19 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…