బాహుబలి, సలార్ గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటాం కానీ ప్రభాస్ కు మాస్ ఫాలోయింగ్ అమాంతం పెంచిన సినిమాల్లో ఛత్రపతిది ప్రత్యేక స్థానం. సింహాద్రి రేంజులో రాజమౌళి కమర్షియల్ విశ్వరూపం బయట పడింది కూడా ఇందులోనే.
ఈ ప్రస్తావన వచ్చినప్పుడంతా సినీ ప్రియులు చర్చించుకునేది ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించే. బాజీరావుని చంపేసి ఆ శవాన్ని ఈడ్చుకొచ్చి ఒక్క అడుగు అంటూ కోట శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇచ్చే సన్నివేశానికి అప్పట్లో థియేటర్లు ఊగిపోయాయి. ఒక పది నిమిషాల ఎపిసోడ్ తో రిపీట్ ఆడియన్స్ ని తేవొచ్చని జక్కన్న నిరూపించాడు.
దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యాన్ని ప్రభాస్ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకున్నాడు. కోటకు వార్నింగ్ ఇచ్చి బయటికి వచ్చాక వందలాది జనం ముందు గొడుగు కింద సుదీర్ఘమైన డైలాగులు చెప్పే సీన్ ఒకటుంది. నిజానికి డార్లింగ్ అక్కడ అరుస్తూ సంభాషణలు చెప్పలేదు.
అంత గట్టిగా అరవలేను, సైలెంట్ గా చెబుతానంటే రాజమౌళి ఓకే అనేశారు. షాట్ అలాగే ఓకే అయిపోయింది. డబ్బింగ్ లో ఫైర్ వినిపించింది. ఇదే స్టయిల్ కొంత కాలం కొనసాగించిన ప్రభాస్ ని మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్ లో కె విశ్వనాథ్ గమనించారు. ఆర్టిస్టు సిగ్గు పడకూడదని, ఓపెన్ గా డైలాగు చెప్పాలని సలహా ఇచ్చారు.
ఛత్రపతిలో అలా చేయడం వల్లే ఇతర దర్శకులు రాజమౌళి వల్లే నేను ఇలా అయ్యానని ఆటపట్టించేవారని ప్రభాస్ చెప్పడం విశేషం. అయినా ఇంత బాహాటంగా తన తప్పుని చెప్పేసుకోవడం డార్లింగ్ కే చెల్లిందేమో. దీని తర్వాతే బాహుబలి నుంచే ప్రభాస్ పెర్ఫార్మన్స్, మార్కెట్, ఇమేజ్ అన్నీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి.
సలార్, కల్కి 2898 ఏడి వరస విజయాలతో మంచి ఊపుమీదున్న ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజి (వర్కింగ్ టైటిల్) లతో బిజీ ఉన్నాడు. ఇవి కాగానే స్పిరిట్ మొదలవుతుంది. కల్కి 2కి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. వీటికన్నా ముందు కన్నప్ప క్యామియోలో కనిపిస్తాడు.
This post was last modified on September 13, 2024 10:10 pm
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…
విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల పార్ట్ 2 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి భాగం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే, రద్దీ కారణంగా…