ఒకే అంశానికి సంబంధించి రెండు భిన్నమైన వ్యవహారాలు తాజాగా వెలుగు చూశాయి. మూడు నెలల క్రితం బెంగళూరు శివారులో నిర్వహించిన ఒక పార్టీ రేవ్ పార్టీగా పేర్కొంటూ అప్పట్లో బెంగళూరు పోలీసులు దాడులు చేయటం.
టాలీవుడ్ నటి హేమ పేరు రావటం తెలిసిందే. ఆ టైంలో తాను హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఆమె చెప్పటం.. ఆ తర్వాత ఆమె సదరు పార్టీలో ఉన్న విషయం బయటకు వచ్చింది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారం అప్పట్లో పెను సంచలనంగా మారింది.
అయితే.. బెయిల్ పైన విడుదలైన హేమ గురువారం ఒక వీడియోను పోస్టు చేశారు. అందులో తన లాయర్ నుంచి తనకు ఇప్పుడే ఫోన్ వచ్చిందని.. తాను శుభవార్త విన్నట్లుగా పేర్కొన్నారు. రేవ్ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకోలేదని మొదట్నించి చెబుతున్నానని.. అదే నిజమని ఇప్పుడు తేలినట్లు చెప్పారు.
పోలీసులు సేకరించిన తన బ్లడ్ శాంపిల్స్ లో తాను డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్టు వచ్చినట్లుగా పేర్కొన్నారు. హేమ వీడియో ఇలా ఉండగా.. ఇదే ఉదంతానికి సంబంధించి తాజాగా పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ వేశారు.
అందులో రేవ్ పార్టీకి సంబంధించిన పలు అంశాల్ని వివరంగా పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీల అభియోగ పత్రంలో నటి హేమతో పాటు మొత్తం 79 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా పేర్కొనటం గమనార్హం. విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్.
వాసుకు చెందిన విక్టరీ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ తన మొదటి వార్షికోత్సవాన్ని రేవ్ పార్టీగా మార్చినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఛార్జ్ షీట్ లో పోలీసులు ప్రతి నిందితుడి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఓవైపు తాను డ్రగ్స్ తీసుకోలేదని.. తనకు గుడ్ న్యూస్ వచ్చిందని హేమ పేర్కొంటే.. మరోవైపుపోలీసులు డ్రగ్స్ తీసుకున్న వారి పేర్లను ప్రస్తావిస్తూ.. పోలీసులు చార్జ్ షీట్ వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
This post was last modified on September 13, 2024 10:38 am
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…