జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘దేవర’ మీద ముందు నుంచి మంచి హైపే ఉంది. కొరటాల శివ చివరి చిత్రం ‘ఆచార్య’ పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. దాని ప్రభావం దీని మీద పెద్దగా పడనట్లే కనిపించింది.
ఐతే తాజాగా ట్రైలర్ లాంచ్ అయ్యాక మాత్రం ‘దేవర’ మీద కొంచెం అంచనాలు తగ్గినట్లే కనిపిస్తోంది. ‘దేవర’ ట్రైలర్ చూస్తే.. ‘ఆచార్య’ మూవీతో రకరకాల పోలికలు కనిపించడం.. కథ రొటీన్ అనిపించడం.. షాక్ ఫ్యాక్టర్ ఏమీ లేకపోవడం మైనస్ అయింది.
దీంతో ఒక్కసారిగా ‘దేవర’ను చూసే కోణం మారిపోయింది. ఈ సినిమా అనుకున్నంత బ్లాక్ బస్టర్ కాదేమో.. పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు రేపడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఇలా అంచనాలు తగ్గిపోవడం మంచిదా కాదా అన్న చర్చ నడుస్తోందిప్పుడు. ఒక రకంగా ఇది మంచికే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
‘దేవర’కు కొన్ని కారణాల వల్ల అవసరానికి మించి హైప్ వచ్చేసింది. ఇది మన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అంటూ కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్‌కు తోడు టీంలోని కొందరి మాటలతో ప్రేక్షకులు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారు.
మరీ అంతటి అంచనాలతో చూస్తే సినిమా ఎంత బాగున్నా నిరాశ పడేందుకు ఆస్కారముంటుంది. పెద్ద సినిమాలకు ఈ అంచనాల ఒత్తిడే పెద్ద మైనస్‌గా మారుతుంటుంది కొన్నిసార్లు. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ తర్వాత ‘దేవర’ మీద అంచనాలు తగ్గి.. మామూలుగా సినిమాను చూస్తారు.
‘ఆచార్య’తో పోలికల వల్ల నెగెటివ్ దృష్టితో సినిమా చూసే అవకాశముంది. సినిమా దానికి భిన్నంగా, మెరుగ్గా అనిపిస్తే అప్పుడు మంచి అనుభూతే కలుగుతుంది. నెగెటివ్ దృష్టితో చూసే సినిమా మెరుగ్గా ఉంటే సంతృప్తిగా ప్రేక్షకుడు బయటికి వస్తాడు. ఈ కోణంలో చూస్తే ‘దేవర’ మీద విడుదల ముంగిట హైప్ తగ్గడం ఒకందుకు మంచిదే అని చెప్పాలి.
This post was last modified on September 12, 2024 5:49 pm
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…