ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ లో కనిపిస్తున్న ఆసక్తికరమైన అంశం ఒకప్పుడు ఫ్లాప్, డిజాస్టర్ గా ముద్రపడిన సినిమాలు ఇప్పుడు భారీ వసూళ్లు రాబట్టడం. ఆరెంజ్ కలెక్షన్లకు నిర్మాత నాగబాబు తెల్లబోవడం చూశాం. ఇదేదో అప్పుడే చూసి ఉంటే నాకు నష్టాలు తప్పేవి కదాని ఓపెన్ గా అనేశారు. సిద్దార్థ్ ఓయ్ కు థియేటర్లు ఊగిపోయాయి. ఏదో టయర్ 1 స్టార్ హీరో రేంజ్ లో దాంట్లో పాటలను ప్రేక్షకులు విపరీతంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. సరే ఇవన్నీ పేరున్న బ్యానర్లు, నటీనటులు చేసినవి కాబట్టి ఓకే. కానీ ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం వచ్చిన 3 కథ వేరు. విడుదలైన అసలు టైంలో సూపర్ ఫ్లాప్ ఇది.
కానీ ఇప్పుడు మాత్రం 3 రీ రిలీజ్ వస్తున్న ప్రతిసారి యూత్ ఎగబడి చూస్తున్నారు. ఇంతకు ముందు ఒకసారి చేసినప్పుడే హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ మంచి లాభాలు కళ్లజూశారు. తక్కువ గ్యాప్ లో ఇప్పుడు మరోసారి సెప్టెంబర్ 14న తెస్తున్నా సరే స్పందన మాత్రం తగ్గడం లేదు. ఇంకా రెండు రోజులు ఉండగానే బుక్ మై షోలో రోజుకు సగటున 8 వేల దాకా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ లో చాలా ఉదయం షోలు ఇప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయాయి. మత్తువదలరా 2, ఏఆర్ఎం, కళింగ, ఉత్సవం లాంటి కొత్త రిలీజులున్నా సరే 3కి ఇంతగా ఎగబడటం విచిత్రమే.
ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన 3కి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. దీని ఫలితం దెబ్బకే కొన్నేళ్లు డైరెక్షన్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. వై థిస్ కొలవెరి పాటను వాడుకోవడం వల్ల అప్పట్లో ఆ మాత్రం హైప్ వచ్చింది కానీ ఆ టైంలో సినిమా చూసిన ఆడియన్స్ నీరసంతో బయటికి వచ్చారు. ఇప్పుడు దానికి రివర్స్ లో స్పెషల్ షోలు చూసేందుకు ఎగబడటం విచిత్రం. ఇప్పటి యూత్ కి ఇందులో కంటెంట్ బాగా కనెక్ట్ అవుతోందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ కెరీర్ తొలినాళ్ళలో కంపోజ్ చేసిన ఆల్బమ్ గా సంగీతం విషయంలో ప్రశంసలు దక్కించుకుంది.
This post was last modified on September 12, 2024 11:05 am
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…