గత దశాబ్ద కాలంలో ఇండియాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ లిస్ట్ తీస్తే అందులో 96 సినిమా పేరు కచ్చితంగా ఉంటుంది. తమిళంలో ప్రేమ్ కుమార్ అనే సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రమిది. తన జీవిత అనుభవాల ఆధారంగా అతను తెరకెక్కించిన ఈ ప్రేమకథ.. ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది. అందరూ రిలేట్ చేసుకునేలా కథ ఉండడం.. సన్నివేశాలు హృద్యంగా సాగడం.. విజయ్ సేతుపతి, త్రిష జంట తమ పాత్రల్లో జీవించడంతో ఈ సినిమా చూసిన వాళ్లందరూ కదిలిపోయారు. వేరే భాషల వాళ్లకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. పాటలు కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశారు కానీ.. ఇక్కడది వర్కవుట్ కాలేదు. తమిళంలో ఉన్న ఒరిజినల్ ఫీల్ ఇక్కడ మిస్సయిందనే టాక్ వచ్చింది. కమర్షియల్‌గా కూడా సినిమా ఆడలేదు.
ఐతే తమిళంలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన 96కు సీక్వెల్ తీయడానికి సన్నాహాలు జరుగుతుండడం విశేషం. ఈ విషయాన్ని ప్రేమ్ కుమారే స్వయంగా వెల్లడించాడు. 96 చేసినపుడు దీనికి సీక్వెల్ తీయాలన్న ఆలోచన లేదని.. కానీ ఇప్పుడు కథను డెవలప్ చేసి స్క్రిప్టు సిద్ధం చేశానని ప్రేమ్ కుమార్ చెప్పాడు. పక్కా స్క్రిప్ట్ తయారైందని.. విజయ్ సేతుపతి, త్రిషలతోనే సీక్వెల్ కూడా తీయాలని అనుకుంటున్నానని.. వాళ్లిద్దరూ ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు సినిమాను మొదలుపెడతానని ప్రేమ్ కుమార్ తెలిపాడు.
ఐతే ఇప్పుడున్న కమిట్మెంట్లలో విజయ్ సేతుపతి 96 సీక్వెల్‌కు డేట్లు ఇస్తాడా అన్నదే డౌట్. అందులోనూ ఇలాంటి క్లాసిక్స్‌ను అలా వదిలేస్తేనే మంచిదని.. బలవంతంగా కథను సాగదీసి సీక్వెల్స్ తీస్తే ప్రేక్షకులకు సహజ అనుభూతి కలగదని.. అంచనాలను అందుకోవడం కూడా కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రేమ్ కుమార్ సీక్వెల్ ప్రయత్నం ఎంతమేర ఫలిస్తుందో చూడాలి.
This post was last modified on September 12, 2024 10:13 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…