Movie News

చిన్న సినిమాల హోరాహోరితో కొత్త శుక్రవారం

బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు ఏమొస్తున్నాయని ఎదురు చూస్తున్న సినీ ప్రియులు ఈ వారం చిన్న చిత్రాలతో సర్దుకోవాలి. ఒక రోజు ముందు గురువారం టోవినో థామస్ ‘ఏఆర్ఎం’ రిలీజవుతోంది.

కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ లాంటి కొందరు తెలిసున్న క్యాస్టింగ్ తప్ప మొత్తం మలయాళం ఫ్లేవర్ లో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీని మైత్రి మూవీ మేకర్స్ పంపిణి చేయడంతో థియేటర్లు బాగానే దక్కుతున్నాయి. అయితే మన నేటివిటీకి సంబంధం లేని ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో మెప్పించడం సవాలే. మరి ఏఆర్ఎం ఇందులో ఏ మేరకు విజయం సాధిస్తుందో రేపే తేలిపోతుంది.

ఎల్లుండి వచ్చే వాటిలో ‘మత్తు వదలరా 2’కి బాగానే హడావిడి చేస్తున్నారు. శ్రీసింహ హీరో కావడంతో ప్రమోషన్ విషయంలో రాజమౌళి లాంటి వాళ్ళు సహాయపడ్డారు. ఏకంగా ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించడం బాగా వర్కౌట్ అయ్యింది. కంటెంట్ కూడా ట్రైలర్ లో చూపించినట్టు ఫుల్ ఫన్ లో ఉంటే జనం థియేటర్లకు వస్తారు. రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’కు హైప్ లేదు. తక్కువ గ్యాప్ లో వరస సినిమాలతో దూసుకొస్తున్న ఈ కుర్ర హీరోకు కోర్టు కేసుల నుంచి కొంచెం రిలీఫ్ దక్కాలంటే ఇది హిట్ కావడం అవసరం. మంచి క్యాస్టింగ్ ఉన్న ‘ఉత్సవం’ క్రమంగా అటెన్షన్ పెంచుకుంటోంది.

ఇవి కాకుండా ‘కళింగ’ అనే మరో బడ్జెట్ మూవీ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇవన్నీ కంటెంట్ మీద ఆధారపడి టాక్ తెచ్చుకోవాలి తప్పించి ఓపెనింగ్స్ ఆశించడం కష్టమే. నెలాఖరులో జూనియర్ ఎన్టీఆర్ దేవర ఉండటంతో సెప్టెంబర్ మూడో వారం దాదాపుగా ఖాళీగా ఉన్న నేపథ్యంలో పైన చెప్పిన సినిమాలేవైనా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సులభంగా రెండు వారాల థియేట్రికల్ రన్ దక్కుతుంది. గత వారం వచ్చిన వాటిలో 35 చిన్న కథ కాదు మాత్రమే నిలదొక్కుకుంది. విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గ్రేటెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోవడంతో సెకండ్ వీక్ కొనసాగడం కేవలం మొక్కుబడికే.

This post was last modified on September 11, 2024 6:13 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

6 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

25 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

58 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago