Movie News

ఆమిర్ ఖాన్ కఠిన నిర్ణయం

ఆమిర్ ఖాన్ కొన్నేళ్ల ముందు వరకు ఇండియన్ సినిమాను ఏలిన హీరో. ‘లగాన్’ దగ్గర్నుంచి తన రేంజే మారిపోయింది. ఆ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ఆ తర్వాత రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు.

ఆమిర్ సినిమా వస్తోందంటే భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రేక్షకులూ థియేటర్లకు వెళ్లిపోయేవారు. ఐతే ఆమిర్ కెరీర్లో ఫ్లాపులు లేవని కాదు కానీ.. ‘లాల్ సింగ్ చడ్డా’ మాత్రం ఆయనకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది.

హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. విడుదలకు ముందే డిజాస్టర్ ఫీల్స్ ఇచ్చింది ఆడియన్స్‌కు. ఆ సమయంలో వేరే వివాదాలు కూడా తోడై ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఆమిర్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆమిర్ ఖాన్ కొంత కాలం సినిమాలే ఆపేసిన పరిస్థితి.

ఐతే ప్రస్తుతం తన ప్రొడక్షన్లో ఓ సినిమ ాను ప్రొడ్యూస్ చేస్తున్న ఆమిర్.. నటుడిగానూ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమిర్ ఓ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాలకు విడుదలకు ముందే డిజిటల్ డీల్స్ చేసుకోకూడదన్నదే ఆ నిర్ణయం.

అంతే కాదు.. రిలీజ్ తర్వాత కూడా వెంటనే ఒప్పందం కుదుర్చుకోరట. థియేటర్లలో ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు ఆడనిచ్చి ఆ తర్వాతే డిజిటల్ హక్కుల అమ్మకం సంగతి చూడాలని ఆమిర్ డిసైడయ్యాడట. కరోనా దగ్గర్నుంచి ఓటీటీల విప్లవం మొదలై.. ఆ ప్రభావం థియేటర్ల మీద గట్టిగానే పడింది.

విడుడలైన కొన్ని వారాలకే ఓటీటీలో సినిమాలు రిలీజైపోతుండడంతో జనం థియేటర్లకు రావడం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన ఏ మల్టీప్లెక్స్ కూడా ఎనిమిది వారాల్లోపు ఓటీటీలోకి వచ్చే సినిమాలను తమ స్క్రీన్లలో ప్రదర్శించడం లేదు. ఇందుకు అనుగుణంగానే హిందీ సినిమాల డిజిటల్ డీల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆమిర్ ఓ అడుగు ముందుకు వేసి థియేట్రికల్ రన్ అంతా అయ్యాకే డిజిటల్ డీల్స్ చేసుకోవాలని ఫిక్సయ్యాడు.

This post was last modified on September 11, 2024 6:08 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago