Movie News

ఈ టాక్‌తో ఆ వసూళ్లు.. నమ్మొచ్చా?

విజయ్ కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. విడుదలకు ముందే సరైన బజ్ తెచ్చుకోని ఈ చిత్రం.. బ్యాడ్ టాక్ కారణంతో తొలి రోజే సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది. చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజైన తమిళ వెర్షన్‌తో కలిపినా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు రూ.3 కోట్ల లోపే.

తొలి రోజు కాబట్టి ఆ మాత్రం వసూళ్లయినా వచ్చాయి. తర్వాతి రోజు నుంచి పరిస్థితి ఘోరంగా తయారైంది. శనివారం వినాయక చవితి, తర్వాతి రోజు ఆదివారం సెలవులను కూడా ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది.

‘గోట్’ను తెలుగులో రిలీజ్ చేసిన మైత్రీ సంస్థకు గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ‘గోట్’ మూవీ కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సరిగా ఆడలేదు. ఉత్తరాదిన అయితే ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదు. యుఎస్‌లో తమిళ వెర్షన్ మాత్రమే బాగా ఆడింది. ఇక మిగిలింది తమిళనాడు వసూళ్లు మాత్రమే.

ఐతే తమిళనాట ఉన్న మొత్తం థియేటర్లు వెయ్యి లోపే. అక్కడ ఎంత పెద్ద సినిమా అయినా ఆరేడొందల థియేటర్లలో రిలీజవుతుతందంతే. కాబట్టి తెలుగులో మాదిరి వీకెండ్లో భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉండదు. అయినా సరే.. ‘గోట్’ వసూళ్ల గురించి తమిళ ట్రేడ్ పండిట్లు ఇస్తున్న అప్‌డేట్స్ షాకింగ్‌గా ఉన్నాయి.

తొలి రోజే వంద కోట్లు దాటేసిందన్నారు. ఇప్పుడు ఐదు రోజులకే రూ.300 కోట్ల మార్కును దాటేసినట్లు గొప్పలు పోతున్నారు. విజయ్ బాక్సాఫీస్ స్టామినా గురించి కొనియాడుతున్నారు. కానీ ఈ సినిమాకు వచ్చిన టాక్‌కు, వసూళ్లకు అసలు పొంతన కుదరడం లేదు.

తమిళంలో సినిమా బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుండొచ్చు కానీ.. మరీ ఐదు రోజులకే 300 కోట్లు అన్నది అతిశయోక్తిలాగే అనిపిస్తోంది. వేరే రాష్ట్రాల్లో పేలవంగా ఆడుతూ 300 కోట్ల వసూళ్లు సాధించడం అన్నది అసాధ్యమైన విషయం.

విజయ్ గత కొన్ని సినిమాలకు కూడా ఇలాగే బాక్సాఫీస్ నంబర్స్ హైప్ చేసి చూపించారనే విమర్శలు వచ్చాయి. ‘లియో’ లాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాకు కూడా 400 కోట్ల వసూళ్ల పోస్టర్ దించారు. దీంతో ‘గోట్’ కలెక్షన్ల లెక్కలు కూడా ఫేక్ అనే ప్రచారం జరుగుతోంది.

This post was last modified on September 11, 2024 6:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పుష్ప-2’లో పేలిపోయే ఎమోషనల్ బ్లాక్

ఒక కథను రెండు భాగాలుగా తీస్తే.. ఫస్ట్ పార్ట్ రిలీజైన దగ్గర్నుంచి ప్రేక్షకులు గెస్సింగ్‌లో పడిపోతారు. తొలి భాగంలో అసంపూర్తిగా…

16 mins ago

రక్త చరిత్ర హీరో సినిమాలకెందుకు దూరం గా ఉంటున్నాడు…

బాలీవుడ్ నటుడే అయినప్పటికీ వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ముఖ్యంగా రక్త చరిత్రలో పరిటాల రవి పాత్ర చాలా…

26 mins ago

హాట్ డిస్కషన్: పుష్ప-2 ఓపెనింగ్ ఎంత?

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఏదైనా పెద్ద సినిమా వస్తోందంటే.. దాని ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి.. రికార్డులేమైనా బద్దలవుతాయా…

36 mins ago

సిద్ధు సినిమా.. ఇప్పుడు తప్పించుకుంది, మరి అప్పుడు?

వచ్చే వారం పుష్ప-2 రిలీజవుతుంటే.. ఏ ధైర్యంతో ఇప్పుడు మీ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అంటూ గత వారం ‘మిస్…

56 mins ago

“నాకు తెలుగు వచ్చు, ‘అందరికీ నమస్కారం’ బ్యాచ్ ఐతే కాదు” – నిధి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు తమ లక్కు ట్రై చేసుకొని బాగా సక్సెస్ అయ్యారు.…

1 hour ago

ఆరుపదుల వయసులో కుర్ర హీరోలకు కంగారు పుట్టిస్తున్న చిరు…

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీకి ఓ బ్రాండ్ గా మారిన…

2 hours ago