Movie News

తమన్నా.. రెండుసార్లు హార్ట్ బ్రేక్

కొన్నేళ్ల ముందు వరకు తమన్నా భాటియాకు సంబంధించి ఎఫైర్లు, బ్రేకప్‌ వార్తలేమీ వచ్చేవి కావు. ఆమె సౌత్ ఇండియన్ హీరోయిన్ ట్యాగ్‌తో కొనసాగినంత కాలం ఆ చర్చలే లేవు. కానీ ఇక్కడ కెరీర్ ఊపు తగ్గాక బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ ఎక్కువ సినిమాలు, సిరీస్‌లు చేయడం మొదలయ్యాక ఈ తరహా వార్తలు ఊపందుకున్నాయి.

బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఇలాంటి చర్చలు ఎప్పుడూ ఉండేవే. తమన్నా కూడా ఆ కోవలోకే చేరింది. విజయ్ వర్మ అనే నటుడితో ఆమె రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిన విషక్ష్ం వెలుగులోకి వచ్చింది. ఐతే ఇదంతా తాము కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ కోసం చేసిన స్టంట్ అనే చర్చ కూడా జరిగింది.

కానీ ఆ సిరీస్ రిలీజయ్యాక కూడా తమన్నా, విజయ్ కలిసే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తమన్నా తన రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే తాను రెండుసార్లు ప్రేమలో విఫలమైనట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.

‘‘ఇప్పటి వరకు నా గుండె రెండుసార్లు ముక్కలైంది. ఆ రెండు సందర్భాల్లోనూ నాకెంతో బాధగా అనిపించింది. టీనేజీలో ఉన్నపుడు తొలిసారి ప్రేమలో దెబ్బ తిన్నాను. ఒక వ్యక్తి కోసం మనకు నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు. జీవితంలో ఏదో సాధించాలని, కొత్త విషయాలు అన్వేషించాలని నా భావన.

ఆ కారణంతోనే ఆ బంధం నిలబడలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. కానీ అతను కూడా నాకు సెట్ కాడనిపించింది. ప్రతి చిన్న విషయానికీ అబద్ధం చెప్పేవాళ్లంటే నాకు ఇష్టం ఉ:డదు. అతను ఆ కోవకు చెందిన వాడే. అలాంటి వ్యక్తితో బంధం కొనసాగిస్తే ప్రమాదం అని అర్థమై దాన్ని ముగించేశా.

అలా రెండుసార్లు నా హృదయం పగిలింది’’ అని తమన్నా చెప్పింది. ఐతే విఫలమైన పాత బంధాల గురించి చెప్పిందే కానీ.. ఇప్పుడు కొత్తగా విజయ్ వర్మతో రిలేషన్‌షిప్ గురించి మాత్రం తమన్నా ఏమీ మాట్లాడలేదు.

This post was last modified on September 11, 2024 6:11 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago