టాలీవుడ్‌కు సంబంధించి అతి పెద్ద పండుగ సీజన్ అంటే సంక్రాంతినే. ఆ టైంలో మూణ్నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ చేసేస్తుంటారు. పోటీ తీవ్రంగా ఉంటుంది. థియేటర్ల కోసం గొడవలు జరిగిపోతుంటాయి. ప్రతి ఏడాదీ దీని మీద వివాదం నడుస్తుంటుంది.
కానీ పది రోజుల సెలవులతో అంతే అడ్వాంటేజ్ ఉన్న సీజన్ అయిన దసరాను మాత్రం టాలీవుడ్ అంతగా పట్టించుకోవట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లలో ఎప్పుడూ దసరాకు అనుకున్నంత సందడి లేదు. ఈసారి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.
గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ ‘విశ్వం’, సుహాస్ చిత్రం ‘జనక అయితే గనక’ మాత్రమే ఆ సీజన్లో రిలీజవుతున్నాయి. వీటికి పెద్దగా క్రేజ్ లేదు. ‘విశ్వం’ లో బజ్‌తో రిలీజవుతోంది. ‘జనక..’ మరీ చిన్న సినిమా.
ఇంతకుముందు అయితే సూర్య సినిమా ‘కంగువ’ రిలీజవుతోందని దసరాను మన వాళ్లు లైట్ తీసుకున్నట్లు కనిపించారు. ఆ సినిమాకు తెలుగులోనూ బంపర్ క్రేజ్ ఉంది. కానీ ఆ చిత్రం వాయిదా పడిపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘వేట్టయాన్’ మాత్రమే రిలీజవుతోంది.
దానికి తెలుగులో కొంత బజ్ ఉండొచ్చు కానీ.. మన దగ్గర క్రేజీ సినిమాలేవీ రిలీజ్ చేసుకోలేనంత ఇబ్బందేమీ లేదు. కానీ టాలీవుడ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. దసరాను ఇలా వదిలేసి అందరూ డిసెంబరు మీద పడిపోయారు.
పుష్ప-2, గేమ్ చేంజర్, తండేల్, రాబిన్ హుడ్, కన్నప్ప.. ఇలా చాలా సినిమాలే డిసెంబరు మీద గురి పెట్టాయి. వీటిలో రెండు సినిమాలను దసరా రేసులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుని ఉంటే వాటికి బాగా అడ్వాంటేజ్ అయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మరోసారి టాలీవుడ్ దసరా కళ తప్పేలా కనిపిస్తోంది.
This post was last modified on September 16, 2024 6:44 am
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…