సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రభావం ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ కోట్లాది పారితోషికాలు ఇచ్చి బ్రాండ్ అంబాసడర్ గా నియమించుకుని యాడ్స్ చేసే సంస్థలు ఏ మేరకు లాభాలు గడిస్తాయోననే సందేహం సామాన్యుల్లో ఉండటం సహజం. ఎందుకంటే సినిమా వేరు, వ్యాపారం వేరు. ఒక హీరో చెప్పినంత మాత్రాన గుడ్డిగా ఏదైనా వస్తువు లేదా సేవలు కొనుగోలు చేసే కస్టమర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేవలం ఒక సెలబ్రిటీనే మొత్తం మార్చేస్తాడని గ్యారెంటీ లేదు. అయినా కూడా మహేష్ బాబు ఈ విషయంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడనే దానికి ఈ ఉదాహరణ చాలు.
ఆన్ లైన్ బస్సు టికెట్లు అమ్మే యాప్ అభి బస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ మొదలైన తొలినాళ్ళలో అంతగా స్పందన ఉండేది కాదు. దీంతో కేవలం మార్కెటింగ్ చేస్తే సరిపోదని, ఏదైనా పెద్దగా ఆలోచించాలని భావించి ఒక నెంబర్ వన్ హీరో ద్వారా అయితే ప్రజలకు త్వరగా తమ గురించి తెలుస్తుందని 2016లో మహేష్ బాబుతో ఒప్పందం చేసుకున్నారు. అప్పటిదాకా రోజుకు 3 వేల టికెట్లు అమ్ముడుపోయే పరిస్థితి నుంచి ఏడాది తిరిగేలోపు రోజుకు 20 వేల టికెట్లకు పైగా అమ్ముకునే రేంజ్ కు చేరుకుంది. కామన్ మ్యాన్ కూడా సులభంగా గుర్తుపట్టేలా మహేష్ అభిబస్ ని చేరువ చేశాడు.
ఇదంతా స్వయంగా అభిబస్ వ్యవస్థాపకుడైన సుధాకర్ రెడ్డి చిర్ర ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో బయటికి వచ్చింది. ఇప్పటికీ మహేష్ తో వాళ్ళ బంధం కొనసాగుతూ ఉంది. అదనంగా రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ నటుడు తోడయ్యారు. ఏది ఏమైనా బ్రాండ్ ఎండార్స్ మెంట్ కు టాలీవుడ్ హీరోలు తీసుకొచ్చే కళ వేరుగా ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ఎందరో తమ ఇమేజ్ తో బ్రాండ్లను అమాంతం పైకి తీసుకొచ్చిన దాఖలాలు ఎన్నో. కాకపోతే మహేష్ బాబు చేస్తున్నన్ని యాడ్స్ మాత్రం ఎవరికీ లేవు.
This post was last modified on September 10, 2024 5:37 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…