మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. డిసెంబరని ఆ మధ్య ట్వీట్ వేశారు కానీ అందులో డేట్ పేర్కొనలేదు. రెండు అంశాల మీద ఈ సినిమా రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది. మొదటిది పుష్ప 2 ది రూల్ కనక ఏదైనా అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6 వదులుకునే పక్షంలో దాన్ని లాక్ చేసుకోవడం. కానీ సుకుమార్ టీమ్ ఆ ఛాన్స్ ఇచ్చేలా లేదు. ఇంకొంత భాగం షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ శరవవేగంగా పనులు జరుగుతున్నాయి. బాలన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ ని వచ్చే నెల పూర్తి చేసి నవంబర్ రెండో వారంకల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసే టార్గెట్ పెట్టుకున్నారు.
రెండోది గేమ్ ఛేంజర్ వస్తుందా రాదానే అనుమానం. దిల్ రాజు పదే పదే డిసెంబరని అంటున్నారు కానీ అందరికీ తెలిసిపోయిన 20 డేటుని అఫీషియల్ చేయడం లేదు. ఒకవేళ ఇది కూడా కన్ఫర్మ్ అయితే కన్నప్ప రామ్ చరణ్, బన్నీ ఎవరితో తలపడినా రిస్క్ అవుతుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ క్యామియోలు ఎన్నయినా ఉండొచ్చు కానీ కన్నప్ప సోలోగా విష్ణు భుజాల మీద నడిచే సినిమా. అతిథి పాత్రలు వాళ్ళు చేశారని ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్ళలేరు. పైగా ముఫాసా లయన్ కింగ్, విడుదల పార్ట్ 2, బేబీ జాన్ లు రేసులో ఉన్నాయి. బయట మార్కెట్లలో వీటితో ఇబ్బంది ఉంటుంది.
సో కన్నప్పకు వెయిట్ అండ్ సి సూత్రాన్ని పాటించడం తప్ప వేరే మార్గం లేదు. సెప్టెంబర్ అయిపోవస్తోంది. అక్టోబర్ దసరా ఛాన్స్ మిస్సయిపోయింది. రజనీకాంత్, గోపీచంద్, సుహాస్ కర్చీఫ్ వేసేశారు. నవంబర్ డ్రై నెల కాబట్టి రిస్క్ తీసుకోలేరు. డిసెంబర్ చూస్తేనేమో అలా ఉంది. పోనీ సంక్రాంతి అనుకుంటే అక్కడ మాములు కాంపిటీషన్ లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అజిత్ లతో నువ్వా నేనా అనే స్థాయిలో ఉంది. ఇదంతా ఎందుకు అనుకుంటే కన్నప్ప హ్యాపీగా ఫిబ్రవరి లేదా మార్చికి షిఫ్ట్ అయిపోవడం ఉత్తమం. అప్పటిదాకా విష్ణు బృందానికి ఈ తర్జన భర్జనలు తప్పేలా లేవు.
This post was last modified on September 10, 2024 3:45 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…