నిన్న వెట్టయన్ నుంచి మొదటి లిరికల్ వీడియో రిలీజయ్యింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం కావడంతో సహజంగానే మ్యూజిక్ లవర్స్ ఎదురు చూపులు తీవ్రంగా ఉన్నాయి. పైగా జైలర్ తర్వాత సోలో హీరోగా తలైవర్ నుంచి వస్తున్న సినిమా కనక ఎప్పుడెప్పుడాని ఎదురు చూశారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా విడుదల చేయడం గమనార్షం. సరే ఇక పాట విషయానికి వస్తే అనిరుద్ స్టయిల్ లోనే హుషారుగా సాగుతూ క్యాచీ ట్యూన్ తో వెళ్ళింది. దేవరతో పోల్చడం సబబు కాదు కానీ నాలుగు నిమిషాల పైన ఉన్న ఈ వీడియోలో ఒక్క అంశం బాగా హైలైట్ అవుతోంది.
ఆమె మంజు వారియర్. వెట్టయన్ లో రజనీకాంత్ జోడిగా నటించింది. మన ప్రేక్షకులకు నేరుగా పరిచయం లేదు కానీ మలయాళంలో బాగా పాపులర్. తమిళంలోనూ సినిమాలు చేసింది. చిరంజీవి గాడ్ ఫాదర్ లో నయనతార క్యారెక్టర్ ని ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో పోషించింది ఈవిడే. వెట్టయన్ పాటలో ఎర్ర చీరకట్టుకుని, గాగుల్స్ పెట్టుకుని హుషారుగా డాన్సు చేస్తూ ఉంటే అభిమానులు దృష్టి ఆటోమేటిక్ గా ఆమె మీదకు వెళ్తున్నాయి.అలాని ఆమె యంగ్ హీరోయిన్ కాదు. ఎప్పుడో 1995లో ఇండస్ట్రీకి వచ్చి చాలా పేరు తెచ్చుకుంది. మంజు వారియర్ కు 45 సంవత్సరాలు.
రజినీకాంత్ పక్కన హైలైట్ అవ్వడం కంటే మాములు విషయం కాదు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా పలువురు ఫ్యాన్స్ కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్న మంజు వారియర్ డాన్సు క్లిప్పులను తెగ షేర్ చేసుకుంటున్నారు. జై భీం లాంటి క్లాసిక్ ఇచ్చిన టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వెట్టయన్ లో రజని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అదే డేట్ ని అంతకు ముందు తీసుకున్న సూర్య కంగువ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తెలుగులోనూ వెట్టయన్ టైటిల్ తోనే రానుంది.
This post was last modified on September 10, 2024 12:50 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…