మరికొద్ది గంటల్లో ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. సినిమా విడుదలకు పదిహేడు రోజుల సమయం ఉంది. అయినా సరే దేవర పార్ట్ 1 ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం అనే స్థాయిలో జరుగుతున్నాయి. ఇంత ముందస్తుగా టికెట్ల అమ్మకాల ద్వారా వన్ మిలియన్ మార్కు అందుకున్న తొలి చిత్రంగా దేవర కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఇతర ప్యాన్ ఇండియా మూవీస్ ఈ ఘనతను సాధించాయి కానీ మరీ 17 రోజుల ముందైతే కాదు. దీన్ని బట్టే హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయంత్రం నుంచి అంచనాలు వేరే రేంజుకి వెళ్ళిపోతాయని అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు.
ప్రీమియర్లు పడేనాటికి సులభంగా రెండు మిలియన్లు దాటే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకో పాట రావాల్సి ఉంది. ట్రైలర్ చూశాక ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతాయి. అమెరికాలో ఈ స్థాయిలో అమ్మకాలు ఊహించిందే అయినా ఇంత స్పీడ్ గా అయితే కాదు. దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ప్రభావం కన్నా జనతా గ్యారేజ్ కాంబో నుంచి వస్తున్న మూవీగా దేవర మీద మాములు బజ్ లేదు. పోస్టర్లు ఆహా ఓహో అనిపించకపోయినా ఉద్దేశపూర్వకంగా దేవర చేస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ వెనుక బలమైన కారణమేదో ఉండే ఉంటుంది. అదేంటనేది కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది.
సెప్టెంబర్ 27 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న దేవర అర్ధరాత్రి నుంచే స్పెషల్ షోలకు సిద్ధం కాబోతున్నాడు. దసరా పండగ దాకా ఏకధాటిగా రెండు వారాలు పెద్దగా పోటీ లేని ఫ్రీ రన్ దక్కుతుండటంతో వసూళ్ల రికార్డులు ఖాయమని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. టాక్ బాగా వస్తే తారక్ మిగిలింది చూసుకుంటాడనే నమ్మకం వాళ్ళలో కనిపిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద పెద్ద భారమే ఉంది. సాంగ్స్ పరంగా నిరాశపరచలేదు కాబట్టి బిజిఎం కూడా దానికి మించిన స్థాయిలో ఇస్తే చాలు. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో వయొలెంట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన దేవరలో హింసే హైలైట్ అంటున్నారు.
This post was last modified on September 10, 2024 11:45 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…