అతి త్వరలోనే ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్‌కు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ‘దేవర’ బంపర్ క్రేజ్ తెచ్చుకోగా.. తన ఫ్యూచర్ సినిమాల లైనప్ కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ను అతి త్వరలోనే మొదలుపెట్టనున్నాడు. మరోవైపు బాలీవుడ్లో ‘వార్-2’ లాంటి మెగా మూవీ చేస్తున్నాడు.
ఇలాంటి హీరో ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైన సందీప్ రెడ్డి వంగతో జట్టు కడితే ఎలా ఉంటుంది? ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందుక్కారణం.. లేటెస్ట్‌గా వంగ, నందమూరి కలయిక జరగడమే.
సందర్భం ఏంటి అన్నది తెలియదు కానీ.. వంగ క్యాజువల్‌గా తారక్‌తో మాట్లాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. అంటే.. ఈ కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది. ఇప్పటిదాకా అయితే నందమూరి-వంగ కాంబినేషన్ గురించి ఎక్కడా డిస్కషన్ లేదు. వీళ్లిద్దరూ మామూలుగానే కలిసి ఉండొచ్చేమో. కానీ ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయమని.. ఇద్దరూ భవిష్యత్తులో వీలు చేసుకుని సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు.
ఐతే తారక్ ఇంకో రెండేళ్ల తర్వాతైనా ఖాళీ అవుతాడేమో కానీ.. వంగ మాత్రం ‘స్పిరిట్’, ‘యానిమల్-2’ చిత్రాలను పూర్తి చేసేసరికి ఇంకో నాలుగేళ్లు పడుతుందని ఇప్పటికే స్పష్టం చేశాడు. ఆ తర్వాత వీలుపడి తారక్‌తో సినిమా చేస్తాడేమో చూడాలి.
This post was last modified on September 9, 2024 3:57 pm
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…
21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…