‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. ఇక సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. ఆమెను చాలా అందంగా, సెక్సీగా చూపించడం ద్వారా మోడర్న్ రాఘవేంద్రరావు అనే పేరు కూడా సంపాదించాడు హరీష్ శంకర్.
ఐతే కొన్ని దృశ్యాలు శృతి మించడంతో విమర్శలూ తప్పలేదు. మరోవైపు ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ కష్టమంతా వృథా అయిపోతుందా.. ఆమె వన్ ఫిలిం వండరేనా అనే చర్చ కూడా జరిగింది. కానీ ఆల్రెడీ కమిటైన క్రేజీ ప్రాజెక్టులతో భాగ్యశ్రీ పేరు మళ్లీ మార్మోగడం ఖాయమనే తన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తాజాగా భాగ్యశ్రీ కొత్త చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. అదే.. కాంత.
మలయాళ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా దగ్గుబాటి రానా ప్రొడక్షన్లో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది భాగ్యశ్రీనే. చీరలో చాలా సెక్సీగా తయారై వచ్చిన తన వైపు కెమెరాలన్నీ తిరిగిపోయాయి. ప్రారంభోత్సవం జరిగిన కాసేపటికే తన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.
‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ తర్వాత భాగ్యశ్రీ చిన్న గ్యాప్ ఇచ్చింది కానీ.. ఆమె కుర్రాళ్లను కుదురుగా ఉండనిచ్చేలా లేదని లేటెస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. ‘మిస్టర్ బచ్చన్’ లాగా పైపై మెరుపులతో కాకుండా సినిమాలోనూ కంటెంట్ ఉంటే భాగ్యశ్రీకి ఈసారి మంచి హిట్ పడడం ఖాయం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్ అనే తమిళ దర్శకుడు రూపొందిస్తున్నాడు.
This post was last modified on September 9, 2024 3:53 pm
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…