బాహుబలి, కెజిఎఫ్, పుష్ప లాంటి ప్యాన్ ఇండియా సినిమాలకు సీక్వెల్స్ అంటే ఆశ్చర్యం లేదు కానీ ఒక కామెడీ క్రైమ్ మూవీకి కొనసాగింపంటే అరుదే. అందులోనూ ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని సినిమాకు ఓపెనింగ్స్ రాబట్టుకోవడమే పెద్ద సవాల్. వినూత్న రీతిలో ప్రమోషన్లు చేస్తే ఆడియన్స్ దృష్టిలో పడొచ్చు. మత్తు వదలరా 2 టీమ్ అదే చేస్తోంది. శ్రీసింహ, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ క్రేజీ ఎంటర్ టైనర్ వచ్చే వారం సెప్టెంబర్ 13 విడుదల కానుంది. ఆగస్ట్ లో చిన్న చిత్రాలకు మంచి ఆదరణ దక్కించుకున్న నేపథ్యంలో దీనికీ అదే రిజల్ట్ వస్తుందనే అంచనాలున్నాయి.
నిన్న ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించారు. ఇది కాదు అసలు విశేషం. ఏదో మొక్కుబడిగా లాప్ టాప్ ఓపెన్ చేయించి, ఒక బటన్ నొక్కించి మమ అనిపించకుండా వెరైటీగా నాలుగు నిమిషాల వీడియోని ప్లాన్ చేయడం వర్కౌట్ అయ్యింది. అందులో ప్రభాస్ ఎక్కువ సేపు నెట్ బఫరింగ్ కోసం వెయిట్ చేయడం, కమెడియన్ సత్య తననే హాట్ స్పాట్ అడగటం, ఫరియా పాట పాడేందుకు సిద్ధపడటం ఇవన్నీ బాగా పేలాయి. అందులోనూ డార్లింగ్ తనదైన కామెడీ టైమింగ్ తో హీరోయిన్ ని ఉద్దేశించి ఇదేంట్రా ఇంత పొడవుందని జోక్ చేయడం వగైరాలన్నీ ప్రేక్షకులను దీని వైపు తిరిగేలా చేశాయి.
ట్రెండీ కామెడీతో రూపొందిన మత్తు వదలరా 2లో సత్యకు మరోసారి చెలరేగిపోయే స్థాయిలో ఫుల్ లెన్త్ కామెడీ రోల్ పడింది. దానికి తగ్గట్టే ఆడుకున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. నిన్న హైదరాబాద్ లో ఫస్ట్ పార్ట్ ని స్పెషల్ గా ప్రీమియర్ వేసి టీమ్ సభ్యులు వెళ్లి జనాలతో మంచి సందడి చేశారు. రితీష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఈ పార్ట్ 2లో ఫన్ తో పాటు బడ్జెట్ ని కూడా బాగా పెంచారు. క్యాస్టింగ్ లో చాలా ఆకర్షణలు తోడయ్యాయి. తమ మీద తామే జోకులు వేసుకోవడంలో మొహమాటపడని మత్తువదలరా 2 బృందం తెరమీద కూడా ఇదే అల్లరి చేసుంటే ఇంకో హిట్టు ఖాయం.
This post was last modified on September 9, 2024 10:49 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…