దేవర పార్ట్ 1 విడుదలకు ఇంకో 18 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ట్రైలర్ లాంచ్ కోసం ఒక రోజు ముందే ముంబై చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ అక్కడి మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తెచ్చిన ఫేమ్ తో పాటు వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్న నేపథ్యంలో తన మీద బాలీవుడ్ వర్గాల్లో మాములు అంచనాలు లేవు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తప్ప ఇంకెవరూ నార్త్ మార్కెట్ లో జెండా పాతలేని పరిస్థితుల్లో కొరటాల శివ దాన్ని చేసి చూపిస్తారనే నమ్మకం తారక్ అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. దానికి తగ్గ స్ట్రాటజీలే ఉన్నాయి.
అందులో భాగంగా ప్రేమగా ఒకరినొకరు బావా బావా అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఒక సరదా ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్టు తెలిసింది. దేవరతో పుష్ప జట్టుకడితే ముచ్చట్లు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పాలా. అయితే బన్నీ డేట్లు అందుబాటుని బట్టి ఏదో ఒక రోజు దీన్ని ప్లాన్ చేయొచ్చని వినికిడి. అదే కనక జరిగితే ప్యాన్ ఇండియా స్థాయిలో దేవర మీద మరింత అటెన్షన్ పెరుగుతుంది. పైగా ఇద్దరి మధ్య ఆన్ లైన్ చనువు చూసిన ఫ్యాన్స్ కి ఆఫ్ లైన్ లో వీళ్ళ బంధం ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కలగడం సహజం. దానికి తగ్గట్టే ఈ ముఖాముఖీ ఉండొచ్చని సమాచారం.
ఇది కాకుండా మరిన్ని వెరైటీ పబ్లిసిటీ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2898 ఏడి తర్వాత బాక్సాఫీస్ ని కళకళలాడించిన సినిమా సరిపోదా శనివారం ఒక్కటే. మళ్ళీ దేవరతో థియేటర్లు కిక్కిరిసిపోతాయని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టిన రేట్లు చూస్తే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. దేవర చివరి దశ పనుల్లో కొరటాల విపరీతమైన ఒత్తిడిలో ఉండటంతో ప్రమోషన్ భారం మొత్తం జూనియర్ ఎన్టీఆరే మోయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే బన్నీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారేమో.
This post was last modified on September 9, 2024 10:38 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…