నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ చిత్రానికి భలే రిలీజ్ డేట్ దొరికిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ కలిసి రానంతగా ఈ చిత్రానికి కలిసొస్తోంది. ‘కల్కి’ తర్వాత సరైన సినిమా రాని నేపథ్యంలో ఆగస్టు నెలాఖర్లో రిలీజైన ‘సరిపోదా శనివారం’ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది.
వర్షాలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో మంచి వసూళ్లతో సాగిపోయిందా సినిమా. రిలీజ్ వారంలో బాక్సాఫీస్ దగ్గర అసలు పోటీయే లేకపోవడం దీనికి బాగా కలిసొచ్చింది. తర్వాతి వారానికి ఆ చిత్రానికి ప్రధాన ముప్పు విజయ్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ నుంచే పొంచి ఉందని భావించారు.
ఐతే ఆ సినిమాకు బ్యాడ్ టాక్ రావడం నాని మూవీకి ప్లస్ అయింది. ఈ వారం ‘35 చిన్న కథ కాదు’ అనే చిన్న సినిమా కూడా రిలీజై మంచి టాక్ తెచ్చుకున్నా దాని వల్ల ‘సరిపోదా..’కు ఇబ్బంది లేకపోయింది.
‘గోట్’ మూవీ రిలీజైన గురువారం ఒక్క రోజు ‘సరిపోదా..’ కొంచెం డల్ అయింది. ఆ రోజు చెప్పుకోదగ్గ వసూళ్లు లేవు. కానీ ‘గోట్’ మూవీ రెండో రోజుకు స్లో అయిపోగా.. నాని సినిమా పుంజుకుంది.
శనివారం వినాయక చవితి సెలవు కూడా కలిసొస్తోంది. వర్షాల ప్రభావం కూడా తగ్గింది కాబట్టి వీకెండ్లో నాని సినిమాకు ఎదురు లేనట్లే. ప్రస్తుతం బాక్సాఫీస్ లీడర్ ఆ చిత్రమే కావడం విశేషం. కొత్త సినిమా మాదిరి వీకెండ్లో మంచి ఆక్యుపెన్సీలతో నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇంకో రెండు వారాల పాటు ‘సరిపోదా శనివారం’ రన్ కొనసాగే అవకాశాలున్నాయి. వచ్చే వారం రానున్న ‘మత్తు వదలరా-2’ పెద్ద థ్రెట్ కాకపోవచ్చు. ‘దేవర’ రిలీజ్‌కు ముందు వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఉండకపోవచ్చు. కాబట్టి ఆ సినిమా వచ్చే వరకు ‘సరిపోదా శనివారం’ రన్ కొనసాగనుంది. వర్షాల వల్ల తొలి వారంలో పడ్డ డెంట్‌ను ఈ లాంగ్ రన్‌తో కవర్ చేసుకోబోతోందీ సినిమా.
This post was last modified on September 8, 2024 10:12 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…