వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయాక ‘కల్కి’ జోరుతో కొంచెం కోలుకుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ కొంత ఉత్సాహాన్నిచ్చింది. భారీ వర్షాల్లోనూ ఆ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. ఇక టాలీవుడ్ చూపంతా ‘దేవర’ మూవీ మీదే ఉంది. ఆ సినిమా విడుదలకు ఇంకో మూడు వారాలే సమయం ఉంది. సెప్టెంబరు 27న ‘దేవర’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
సోలో హీరోగా తారక్ చివరి సినిమా ‘అరవింద సమేత’కు ఉన్న హైప్, దానికి జరిగిన బిజినెస్, అది సాధించిన వసూళ్లకు.. ‘దేవర’ఖు అసలు పోలికే ఉండబోదనడంలో సందేహం లేదు. ఎందుకంటే పాన్ వరల్డ్ హిట్ ‘దేవర’ తర్వాత తారక్ నుంచి వస్తున్న చిత్రమిది. దీనిపై ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో యుఎస్ ప్రి సేల్స్‌కు వస్తున్న స్పందనను బట్టే అర్థం చేసుకోవచ్చు.
విడుదలకు నెల రోజుల ముందే ‘దేవర’ యుఎస్ ప్రిమియర్స్ టికెట్ల అమ్మకాలు మొదలైపోయాయి. ఆరంభం నుంచే జోరుగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఆల్రెడీ అక్కడ 15 వేల టికెట్లు సేల్ అయిపోవడం విశేషం. విడుదలకు మూడు వారాల ముందే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడైన ఇండియన్ సినిమాలు అరుదు. అప్పుడే ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును కూడా టచ్ చేసేసింది.
చూస్తుంటే ప్రి సేల్స్‌తోనే సినిమా మిలియన్ మార్కును కూడా అందుకునేలా ఉంది. దీన్ని బట్టే సినిమాకు హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. యుఎస్ నంబర్స్ అనూహ్యమైన స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు. ఇండియాలో కూడా ‘దేవర’కు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల చివరి వారం ‘దేవర’ ఊపుతో ఊగిపోవడం గ్యారెంటీ.
This post was last modified on September 7, 2024 10:47 am
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…