Movie News

రాజ్‌కే ఆమె 70 లక్షలిచ్చిందట

ఈ మధ్య కొన్ని వారాల పాటు యువ కథానాయకుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి తనతో రాజ్ ఎన్నో ఏళ్ల పాటు సహజీవనం చేయడంతో పాటు, పెళ్లి కూడా చేసుకుని ఈ మధ్య తనను విడిచిపెట్టాడంటూ అతడి మీద కేసులు పెట్టి పలు ఆరోపణలు చేయడం.. దీని మీద రాజ్ ఎదురు దాడి చేయడం.. ఇద్దరి మధ్య గొడవ పతాక స్థాయికి చేరడంతో మీడియాలో ఈ వ్యవహారం చాలా రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మధ్యే ఆ గొడవ కాస్త సద్దుమణిగినట్లు అనిపించింది. కానీ తాజాగా పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం.. రాజ్‌ పేరును అందులో నిందితుడిగా పేర్కొనడం.. తనకు వ్యతిరేకంగా ఆధారాలున్నట్లు పేర్కొనడంతో మళ్లీ ఈ వ్యవహారం చర్చకు వచ్చింది.

ఇదే సమయంలో లావణ్య ప్రెస్ మీట్ పెట్టి మరోసారి రాజ్ మీద ఆరోపణలు, విమర్శలు చేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఆశ్చర్యకర విషయం వెల్లడించింది. అందరూ అనుకుంటున్నట్లు రాజ్ తనను పోషించలేదని.. తనే అతణ్ని పోషించానని ఆమె చెప్పడం గమనార్హం.

తన తల్లిదండ్రులు రాజ్‌కు 70 లక్షలు డబ్బులు ఇచ్చారని ఆమె చెప్పింది. గతంలో రాజ్ సినిమాలు లేకుండా రెండేళ్లు ఖాళీగా ఉండిపోయాడని.. ఆ టైంలో తన తల్లిదండ్రులు తమకున్న స్థలాలు అమ్మి 70 లక్షల రూపాయల డబ్బు రాజ్‌కు ఇచ్చారని ఆమె తెలిపింది.

తమ స్థలాలు అమ్మిన తేదీలు, రాజ్‌కు డబ్బులు ఇచ్చిన చెక్కులకు సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని ఆమె చెప్పింది. మరోవైపు రాజ్‌కు మద్దతుగా మాట్లాడి తనతో గొడవ పడ్డ శేఖర్ బాషా గురించి లావణ్య మాట్లాడుతూ.. అతను పాపులారిటీ కోసమే తమ గొడవలో తలదూర్చి, ఆ ఫేమ్‌తో బిగ్ బాస్ షోలోకి వెళ్లాడని ఆమె ఆరోపించింది.

This post was last modified on September 7, 2024 10:41 am

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

29 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago