Movie News

గేమ్ చేంజర్ రచ్చ.. నిర్మాతలకు చేరిందా?

తమ అభిమాన కథానాయకుడి సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి తరచుగా అప్ డేట్స్ ఆశిస్తారు అభిమానులు. వాళ్లు కోరుకున్నట్లుగా రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. వాళ్ల మనోభావాలను అస్సలు పట్టించుకోకుండా సైలెంటుగా ఉండిపోతే.. తప్పే అవుతుంది.

‘గేమ్ చేంజర్’ సినిమా విషయంలో అదే జరుగుతోంది. దాదాపు నాలుగేళ్ల ముందు మొదలైంది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. కనీసం రిలీజ్ ఎప్పుడో కూడా తెలియడం లేదు. ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి, అప్ డేట్స్ ఏమీ లేకపోవడానికి, అంచనాలు తగ్గిపోతుండడానికి ప్రధాన కారణం దర్శకుడు శంకర్ అనడంలో సందేహం లేదు.

ఆయన మధ్యలో ‘ఇండియన్-2’ మీదికి వెళ్లడం వల్ల ‘గేమ్ చేంజర్’ బాగా ఆలస్యమైంది. పైగా ‘ఇండియన్-2’ పెద్ద డిజాస్టర్ కావడంతో దాని తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడింది. అలాంటపుడు ఎగ్జైటింగ్ కంటెంట్ రిలీజ్ చేసి సినిమాకు హైప్ పెంచాల్సిన అవసరముంది.

కానీ ఏ అప్ డేట్ లేదు. కనీసం రిలీజ్ గురించి కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. దిల్ రాజు ఆ మధ్య అన్నట్లు క్రిస్మస్‌కు అయినా సినిమా రిలీజవుతుందా అన్నది సందేహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు శంకర్‌తో పాటు నిర్మాణ సంస్థను తిట్టిపోస్తూ బూతు మాటలు జోడించి ట్రెండ్ చేశారు. అది ఇండియా లెవెల్లో ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో ఇంత గొడవ జరిగాక మేకర్స్‌కు ఈ విషయం తెలియకుండా ఉండదు.

దిల్ రాజు సోషల్ మీడియా ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు కూడా. ఐతే ఈ సినిమా విషయంలో అతి పెద్ద బాధితుడు ఆయనే అన్నది వాస్తవం. సినిమా చాలా ఆలస్యం కావడం ఇప్పటికే చాలా నష్టపోయాడు. హైప్ తగ్గిపోవడం వల్ల ఇంకా పెద్ద ఇబ్బంది ఎదురయ్యేలా ఉంది. కానీ శంకర్‌ను శాసించే స్థితిలో ఆయన లేడు. రిక్వెస్ట్ చేసి అయినా సినిమా రిలీజ్ డేట్ సంగతి తేల్చాల్సిన అవసరముంది.

కాగా వినాయకచవితి సందర్భంగా ‘గేమ్ చేంజర్’ అప్ డేట్ రాబోతోందని సంగీత దర్శకుడు తమన్ తాజాగా పోస్ట్ పెట్టాడు. బహుశా ఇటీవలి ట్రెండ్ తాలూకు ఎఫెక్టే కావచ్చు. మరి చవితికి రెండో పాట గురించి కబురు చెబుతారా.. లేక రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందా అన్నది చూడాలి.

This post was last modified on September 6, 2024 5:53 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

50 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago