బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2 అతి తక్కువ కాలంలో 500 కోట్ల మైలురాయి దాటిన సినిమాగా కొత్త రికార్డు నమోదు చేసుకుంది. కేవలం 22 రోజుల వ్యవధిలో ఇంత మొత్తం వసూలు చేయడమంటే మాటలు కాదు. ఉత్తరాది రాష్ట్రాల సంగతి పక్కనపెడితే ఏపీ, తెలంగాణ లాంటి దక్షిణాది స్టేట్స్ లోనూ ఇప్పటికీ రన్ అవుతుండటం గమనించాల్సిన విషయం. గత ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన గదర్ 2 లైఫ్ టైం కలెక్షన్లను స్త్రీ 2 వేగంగా అందుకోవడం చూసి ట్రేడ్ సైతం నివ్వెరపోతోంది. కేవలం ఇంకో పాతిక కోట్లు వసూలు చేస్తే చాలు సన్నీ డియోల్ స్థానం శ్రద్ధాకపూర్ కు వచ్చేస్తుంది.
కేవలం యాభై నుంచి అరవై కోట్ల మధ్యలో రూపొందిన స్త్రీ 2కి లాభాల శాతం లెక్కేసుకుంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. తర్వాత పోటీనిచ్చే సినిమాలు ఏవీ రాకపోవడంతో ఈ దెయ్యాన్ని కంట్రోల్ చేయడం కష్టమేనని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు రావాల్సిన కంగనా రౌనత్ ఎమెర్జెన్సీ పలు వివాదాలు, సెన్సార్ సమస్యల్లో ఇరుక్కుపోవడంతో వాయిదా పడింది. దీంతో ఇది కాస్తా స్త్రీ 2కి సానుకూలంగా మారింది. స్త్రీ మొదటి భాగం పెద్ద హిట్టయినా వంద కోట్లు దాటగానే నెమ్మదించి సెలవు తీసుకుంది. కానీ స్త్రీ 2 మాత్రం తగ్గేదేలే అంటూ ఇంత దూరం తీసుకొచ్చింది.
దెబ్బకు హారర్ జానర్ లో నిర్మాణంలో ఉన్న ఇతర హిందీ సినిమాలకు డిమాండ్ పెరుగుతోందట. సెప్టెంబర్ 13 రీ రిలీజ్ కాబోతున్న తుంబాడ్ కోసం డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున స్క్రీన్లు ఇస్తున్నారు. భూల్ భులయ్యా 3 ఇంకా సగం షూటింగ్ కాకుండానే మొత్తం బడ్జెట్ ని ఇస్తామంటూ పలు ఓటిటి సంస్థలు ప్రతిపాదనలు పెట్టాయట. రామ్ గోపాల్ వర్మ భూత్ 2 తీసే ఆలోచనలో ఉన్నట్టు టాక్ రావడం ఇంకో ట్విస్టు. మన దగ్గర హారర్ కామెడీ జానర్ కొంత తగ్గుముఖం పట్టింది కానీ ప్రభాస్ ది రాజా సాబ్ వచ్చాక మళ్ళీ ఊపొచ్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దెయ్యాలకున్న పవర్ అలాంటిది మరి.
This post was last modified on September 6, 2024 5:09 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…