తాజాగా రిలీజైన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంకు తెలుగులో ఎలాంటి స్పందన వస్తోందో చూస్తున్నాం. సాధారణంగా విజయ్ సినిమాలకు ఉండే హైప్ సగం కూడా కనిపించకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ లేనిది హైదరాబాద్ లో తెల్లవారుఝామున నాలుగు గంటలకు స్పెషల్ షోలు వేయడం చూసి కంటెంట్ ఆషామాషీగా ఉండదనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమయ్యింది. అయితే దర్శకుడు వెంకట్ ప్రభు అంచనాలు అందుకోవడంలో తడబడి క్యామియోలు, అవసరం లేని ట్విస్టుల మీద ఆధారపడటంతో బెస్ట్ కాలేకపోయింది. అసలు ఇందులో మెయిన్ పాయింట్ కాపీ కొట్టిందంటే షాకేగా.
1993లో విజయ్ కాంత్ హీరోగా రాజదురై వచ్చింది. తెలుగులో రాజసింహగా డబ్ చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మీద పగతో రగిలిపోయిన విలన్ పసివాడిగా ఉన్న అతని కొడుకుని ఎత్తుకుపోయి చెడ్డవాడిగా, తండ్రి మీద ద్వేషం కలిగేలా పెంచుతాడు. యుక్త వయసు వచ్చాక అచ్చం నాన్న పోలికల్లోనే ఉన్న విజయ్ కాంత్ స్వంత ఇంటికే శత్రువుగా మారతాడు. ఆ తర్వాత జరిగే డ్రామానే స్టోరీ. దీన్నే గోట్ లో వాడుకున్నాడు వెంకట్ ప్రభు. కాకపోతే విజయ్ కి డీ ఏజింగ్ టెక్నాలజీ వాడి డిఫరెంట్ గా ట్రై చేశాడు. తేడా ఏంటంటే కొడుకు నెగటివ్ షేడ్ ని క్లైమాక్స్ దాకా మార్చకుండా కొనసాగించడం.
దీన్ని కొందరు ఫ్యాన్స్ గుర్తించగా ఈ విషయం మీద అవగాహన లేని వాళ్ళు వెంకట్ ప్రభు వెరైటీ కథ రాసుకున్నారని ఆశ్చర్యపోయారు. ఇంకో ట్విస్టు ఏంటంటే ఇది గోట్ లో విజయ్ కాంత్ కి నివాళి అర్పిస్తూ ఏఐ టెక్నాలజీ వాడి ఆయన పాత్రను కొన్ని నిమిషాల పాటు పునఃసృష్టించారు. అయినా విజయ్ కథలు ఇలా పాత బ్లాక్ బస్టర్స్ తో పోలి ఉండటం కొత్త కాదు. తేరి (క్షత్రియుడు), మాస్టర్ (చిరంజీవి మాస్టర్), బీస్ట్ (కన్నడ మూవీ నిష్కర్ష) ఇలా ఎన్ని రెఫరెన్సులతోనే బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. కానీ ఈసారి ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఆ ఛాన్స్ ఇచ్చేలా లేదు. తమిళ సంగతేమో కానీ తెలుగులో మాత్రం ఎదురీదుతోంది.
This post was last modified on September 6, 2024 2:09 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…