హారిక హాసిని క్రియేషన్స్ కి త్రివిక్రమ్ కట్టుబడిపోయిన సంగతి తెలిసిందే. హీరోలు వేరే బ్యానర్లో చేయమన్నా కానీ హారిక హాసిని భాగస్వామ్యంలోనే త్రివిక్రమ్ తన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాగే రంగస్థలం, పుష్ప తర్వాత ఇక సుకుమార్ తమ సంస్థకు కట్టుబడి వుంటాడని మైత్రి మూవీస్ అధినేతలు నమ్మకం పెట్టుకోవడంలో వింత లేదు. పైగా అతని నిర్మాణ భాగస్వామ్యంలోను పలు చిత్రాలను వారు చేస్తున్నారు.
హారిక హాసినికి త్రివిక్రమ్ మాదిరిగా తమకు సుకుమార్ ఆస్థాన దర్శకుడు అవుతాడని అనుకుంటోన్న దశలో ఇంకా పుష్ప షూటింగ్ మొదలు కాకుండానే సుకుమార్ తన తదుపరి చిత్రం వేరే నిర్మాతకు చేస్తున్నట్టు ప్రకటించేసాడు. మరోవైపు కొరటాల శివ కూడా మైత్రితో అనుబంధం కొనసాగించడం లేదు. వారికి సలహాదారుగా వుంటున్నాడే తప్ప తన స్నేహితుడికే ఇక సినిమాలు చేసి పెట్టాలని కొరటాల నిర్ణయించుకున్నాడు. అయినా త్రివిక్రమ్‍తో హారిక హాసిని సంస్థకు కుదిరినట్టు ఈ రోజుల్లో ఒక అగ్ర దర్శకుడిని ఒకే నిర్మాణ సంస్థకు కట్టుబడేలా చేయడం కష్టం.
అవతలి పార్టీలు భారీ ఆఫర్లు ఇస్తూ వుండగా అవన్నీ వదిలేసుకుని ఒకరికే కట్టుబడి వుంటే క్రియేటివ్ డిఫరెన్సులు కూడా పుట్టుకొచ్చేసి మొత్తానికే సంబంధాలు బీటలు వారే ప్రమాదముంటుంది. అసలు పుష్ప ఖరారు కావడానికే ముందే మహేష్‍బాబు ప్రాజెక్ట్ విషయంలో చాలా డ్రామా జరిగింది. అయితే లక్కీగా ఎక్కువ డ్యామేజీ లేకుండా పుష్ప పట్టాలెక్కింది.
This post was last modified on September 28, 2020 10:16 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…