నందమూరి అభిమానులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజుని పురస్కరించుకుని తన ఎంట్రీని ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, తేజస్విని సంయుక్తంగా నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఈ ప్యాన్ ఇండియా మూవీని సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్, విఎఫెక్స్ ఎఫెక్ట్స్ తో తీయబోతున్నారు. హీరోయిన్ గా కొత్తమ్మాయిని సెట్ చేసే పనిలో ఉన్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది.
ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతున్నాయి. ఇందులో బాలయ్య ఒక ప్రత్యేక క్యామియో చేయబోతున్నారట. అది కూడా శ్రీకృష్ణుడి గెటప్ లో క్లైమాక్స్ మొత్తం గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇండస్ట్రీ లాంచ్ కోసం బాగా మేకోవర్ చేసుకున్న మోక్షజ్ఞ నటనకు సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకున్నాడు. డెబ్యూ ఆషామాషీగా ఉండకూడదని బాలయ్య ఏళ్ళ తరబడి సమయం ఖర్చు పెట్టారు. ఒకదశలో ఆదిత్య 999 ద్వారా పరిచయం చేయాలనుకున్నారు కానీ ఎందుకనో నిర్ణయం మార్చుకున్నారు.
అన్ స్టాపబుల్ షూటింగ్ సమయంలో ప్రశాంత్ వర్మ చెప్పిన లైన్ నచ్చడం దగ్గరి నుంచే తన ప్రయాణం బాలయ్యతో మొదలయ్యింది. హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించడం చూశాక నమ్మకం మరింత రెట్టింపయ్యింది. స్టార్ వారసుల లాంచ్ లో రామ్ చరణ్ చిరుత, మహేష్ బాబు రాజకుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని, ప్రభాస్ ఈశ్వర్ వగైరాలన్నీ కమర్షియల్ ఫార్ములాతో రూపొందిన మాస్ సినిమాలు. దానికి భిన్నంగా మోక్షజ్ఞ కోసం ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోనున్న మోక్షజ్ఞ 1 ఓపెనింగ్ అంగరంగవైభవంగా జరగనుంది.
This post was last modified on September 6, 2024 10:58 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…