మాచో హీరో గోపీచంద్ కు మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉన్నా గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని ఫ్లాపులు అభిమానులను ఇబ్బంది పెట్టాయి. తనను సరైన రీతిలో వాడుకునే దర్శకుడు దొరకడం లేదు. అక్టోబర్ 11 విడుదల కాబోతున్న విశ్వం ట్రైలర్ చూశాక క్రమంగా అంచనాలు పెరుగుతున్న మాట వాస్తవం. శ్రీను వైట్ల ఫామ్ లో లేకపోయినప్పటికీ తనదైన కామెడీ ప్లస్ యాక్షన్ మిక్స్ చేసిన తీరు పట్ల సోషల్ మీడియాలో పాజిటివిటీ కనిపిస్తోంది. ఇది హిట్ అయితే హీరో, డైరెక్టర్ ఇద్దరికీ బలమైన కంబ్యాక్ దొరుకుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే బాలకృష్ణ బోయపాటి శీను కలయికలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీలో విలన్ గా గోపీచంద్ ని అడిగే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ప్రతిపాదన దశ వద్దే ఉంది. ఇంకా స్టోరీ నెరేషన్ దాకా వెళ్లలేదట. కరెక్ట్ కంటెంట్ దొరకాలే కానీ గోపీచంద్ లో అద్భుతమైన విలన్ ఉన్నాడనే విషయం వర్షం, జయం లాంటి బ్లాక్ బస్టర్స్ లో బయట పడింది. నిజం సరిగా ఆడకపోయినా మహేష్ బాబు తర్వాత అందరూ మాట్లాడుకున్నది గోపీచంద్ పెర్ఫార్మన్స్ గురించే. యజ్ఞం సూపర్ హిట్టయ్యాక కథానాయకుడిగా కొనసాగడం జరుగుతోంది.
మరి బాలయ్యకు సవాల్ విసిరే పాత్రకు ఒప్పుకుంటాడా అనేది వేచి చూడాలి. అఖండ 2గా ప్రచారంలో ఉన్న బాలయ్య బోయపాటి సినిమా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 109 నవంబర్ లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఆలోగా స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ముగించే పనిలో ఉన్నారు బోయపాటి. లెజెండ్ ద్వారా జగపతిబాబుకి కొత్త కెరీర్ ఇచ్చిన ఈ మాస్ దర్శకుడు ఈసారి అంతకు మించి అనే స్థాయిలో విలన్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడట. విశ్వం విజయం సాధిస్తే మాత్రం ఇది ప్రపోజల్ దగ్గరే ఆగిపోవచ్చు. చూడాలి మరి ఏ మేరకు నిజమవుతుందో.
This post was last modified on September 6, 2024 10:53 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…