తాజాగా విడుదలైన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం క్లైమాక్స్ అయిపోయాక హాలీవుడ్ తరహాలో ఎండ్ టైటిల్స్ తర్వాత చిన్న సన్నివేశం నడిపించారు. విజయ్ పోషించిన నెగటివ్ పాత్ర తాలూకు చిన్న ట్విస్టుని రివీల్ చేసి కథ అక్కడితో అయిపోలేదనే హింట్ ఇచ్చారు.
అయితే చివరిలో గోట్ వర్సెస్ ఓజి అని కార్డు వేసి దాని కింద ఏ విక్రమ్ ప్రభు విలన్ అంటూ ఊరించారు. అంటే గోట్ సీక్వెల్ కి పేరు ఇదన్న మాట. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే బలమైన నమ్మకం కాబోలు ముందే పార్ట్ 2 అని ఫిక్స్ అయినట్టు ఉన్నారు. అయితే ప్రాక్టికల్ గా దీనికి అవకాశాలు తక్కువ లెండి.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఓజి చేస్తున్న సంగతి మొన్నటి ఏడాదే అధికారికంగా ప్రకటించారు. గోట్ మొదలయ్యింది ఆ తర్వాతే. ఓజి పదం అభిమానుల్లో ఎంతగా చొచ్చుకుపోయిందో చూస్తూనే ఉన్నాం. గబ్బర్ సింగ్ తమిళనాడులో రీ రిలీజ్ అయితే అక్కడ కూడా ఈ సినిమా బ్యానర్లతోనే హోరెత్తించారు. అంతగా దాని ఫీవర్ ఫ్యాన్స్ లో ఉంది. అలాంటప్పుడు అది ప్రత్యేకంగా పవర్ స్టార్ కు వదిలేయాల్సిన పేరు. ఇప్పుడు అదే పనిగా గోట్ VS ఓజి అని పెట్టడం వెనుక కేవలం తెలుగు ఫ్యాన్స్ ని కవ్వించడం కోసమే అంటే ఏమో మరి.
ఒకవేళ ఈ ఉద్దేశమైతే ఇదీ మంచికే అనుకోవాలి. ఓజి అనేది ఎంత పవర్ ఫుల్ బ్రాండ్ గా మారిందో అర్థం చేసుకోవడానికి. గత కొన్నేళ్లలో తెలుగు రాష్ట్రాల వరకు తక్కువ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా గోట్ నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయం. విఎఫెక్స్ ఎఫెక్ట్స్, క్యామియోలు, పాత పాటల రెఫరెన్సులు, బ్లాక్ బస్టర్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు ఇలా ఏది దొరికితే దాన్ని వాడేసిన దర్శకుడు వెంకట్ ప్రభు కోలీవుడ్ ఆడియన్స్ ని సంతృప్తిపరచవచ్చేమో కానీ తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించడం అనుమానంగానే ఉంది. పోటీలో వచ్చే కొత్త సినిమాల ఫలితాల మీద పికప్ ఆధారపడి ఉంది.
This post was last modified on September 6, 2024 5:56 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…