నితిన్ హీరోగా సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ నిర్మిస్తోన్న రంగ్ దే చిత్రం షూటింగ్ మళ్లీ మొదలయింది. ఈ చిత్రం పూర్తి చేయడం కోసం కీర్తి సురేష్ కూడా హైదరాబాద్‍లో దిగింది. ఈ చిత్రం తర్వాత ‘అంధాదూన్’ రీమేక్ చేయడానికి నితిన్ సంకల్పించాడు. ఆ చిత్రానికి తారాగణం కూడా ఫైనల్ చేసేసారు. నభా నటేష్, తమన్నా ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్ చేయబోతున్నారు. ఎక్స్ప్రెస్ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తాడు. అయితే దీని కంటే ముందు నితిన్ మొదలు పెట్టిన మరో సినిమా వుంది.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాని నితిన్ ‘రంగ్ దే’తో పాటు మొదలు పెట్టాడు. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ అందులో హీరోయిన్లు. అంధాదూన్ కంటే ముందు ఆ సినిమా పూర్తి చేయాలనే నితిన్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ లాక్‍డౌన్‍లో ఏమయిందో ఏమో నితిన్ కానీ, అతని పీఆర్ టీమ్ కానీ ఏలేటి సినిమా గురించి అస్సలు మాట్లాడ్డం లేదు.
ఆ సినిమాను ఆపేసారా లేక తర్వాత చేస్తారా అనేదానిపై కూడా ఇన్‍ఫర్మేషన్ లేదు. ఏలేటి సోషల్ మీడియాకు దూరంగా వుంటాడు కనుక ఆయన దీనిపై స్పందించే అవకాశం లేదు. నితిన్ ఏమో అసలిదో సినిమా వుందనే సంగతి గుర్తున్నట్టే లేడు. నితిన్‍కి ఈ సినిమా కీలకం కాకపోవచ్చు కానీ రకుల్, ప్రియా ప్రకాష్‍తో పాటు దర్శకుడు ఏలేటికి మాత్రం ఇది చేయడం చాలా అవసరం. మరి నితిన్ ఆలోచన ఎలాగుందో?
This post was last modified on September 28, 2020 10:03 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…