టాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ముందు వరసలో ఉంది. ఈ ఏడాది కనీసం అయిదు సినిమాలు రిలీజయ్యేంత బిజీ షెడ్యూల్ తో మాములు బిజీగా లేదు. అయితే తనకిస్తున్న పాత్రలే మరీ అన్యాయంగా అనిపిస్తున్నాయి.
ఆ మధ్య గుంటూరు కారంలో శ్రీలీల స్థానంలో తనను తీసుకున్నప్పుడు అందరూ జాక్ పాట్ అనుకున్నారు. తీరా చూస్తే మహేష్ బాబుకి ఆమ్లెట్ ఇవ్వడానికి, జయరాంకు మందు పోయడానికి తప్ప త్రివిక్రమ్ ఎందుకూ ఉపయోగించుకోలేదు. కనీసం ఒక పాట కూడా లేని ఇలాంటి క్యారెక్టర్ లో చూసి ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు.
ఇప్పుడు ది గ్రేటెస్ట్ అఫ్ ది ఆల్ టైం వంతు వచ్చింది. కోలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే విజయ్ సరసన ఛాన్స్ అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. పైగా సోలో హీరోయిన్. స్నేహ ఉంది కానీ తండ్రి విజయ్ కు జోడి కాబట్టి మీనాక్షి చౌదరికి బంపర్ ఆఫరనుకున్నారు.
తీరా చూస్తే గోట్ లో మరోసారి నిరాశపరిచే స్పానే దొరికింది. యంగ్ తలపతితో ఒక పాటలో డాన్స్ చేసే ఛాన్స్ దొరికింది కానీ అది మరీ చప్పగా రాంగ్ ప్లేస్ మెంట్ లో వచ్చింది. ఇక్కడ చెప్పకూడదు కానీ మీనాక్షి చౌదరికి సెకండాఫ్ లో ఇచ్చిన ట్విస్టుకి అభిమానుల మనసులు గాయపడటం ఖాయం.
సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీనాక్షి చౌదరి ఇకపై ఆశలు పెట్టుకోవాల్సింది మీడియం రేంజ్ హీరోల సినిమాల మీదే. వచ్చే నెల చివరి వారం ఒకేసారి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ రిలీజ్ కాబోతున్నాయి. వీటి మీద ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి.
ఒకవేళ రెండూ హిట్ అయితే అప్పుడీ అమ్మడికి పెద్ద బ్రేక్ దొరికినట్టు అనుకోవచ్చు. వరుణ్ తేజ్ మట్కా మీద భారీ బజ్ ఉన్న నేపథ్యంలో ఇది కూడా క్లిక్ అయితే కెరీర్ ఊపందుకోవచ్చు. హిట్లు బ్లాక్ బస్టర్లు ఉంటేనే హీరోయిన్లను పలకరించే ట్రెండ్ లో మీనాక్షి చౌదరికి ఈ సక్సెస్ లు చాలా కీలకం.
This post was last modified on September 5, 2024 1:37 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…