జైలర్ సినిమాలో తమన్నా చేసిన ‘కావాలయ్యా’ పాట చాలా స్పెషల్. ఆ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి హైప్ తేవడంలో ఆ పాట కీలక పాత్ర పోషించింది. రిలీజ్ తర్వాత థియేటర్లలో కూడా ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘జైలర్’ విడుదలకు ముందు, తర్వాత కొన్ని నెలల పాటు రీల్స్, షార్ట్స్‌లో ఎక్కడ చూసినా ఆ పాటే తిరిగింది. కోట్ల మంది ఆ పాటకు స్టెప్పులేశారు. తమన్నా మంచి డ్యాన్సర్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ.. ఈ పాటకు ఆమె వేసిన స్టెప్పులు వేరే లెవెల్ అని చెప్పాలి.
ఐతే ఈ పాట మరీ అంత పెద్ద హిట్టయ్యేసరికి తమన్నాకు భయం పట్టుకుందట. మరో సినిమాకు ఐటెం సాంగ్ అడిగితే.. నేను చెయ్యను అనే స్థాయిలో ‘కావాలయ్యా’ సాంగ్ తమన్నాను భయపెట్టేసిందట. కానీ దర్శకుడు తనకు నచ్చజెప్పి ‘స్త్రీ-2’లో స్పెషల్ సాంగ్ చేయించినట్లు తమన్నా వెల్లడించింది.
“జైలర్‌లో నా పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి షాకయ్యా. ఆ సాంగ్ అంత పెద్ద హిట్టవడం నా మీద ఒత్తిడి పెంచింది. మళ్లీ ఇలాంటి పాట చేస్తే అంత పెద్ద హిట్టవుతుందో లేదో.. అంచనాలను అందుకోలేకపోతే ఇబ్బంది కదా అనే భయం పట్టుకుంది నన్ను. అందుకే ‘స్త్రీ-2’లో స్పెషల్ సాంగ్ కోసం టీం నన్ను సంప్రదించగానే చేయనని చెప్పేశా. ఆ పాట అంచనాలను అందుకోలేకపోతే సినిమాకే రిస్క్ అని చెప్పా. కానీ దర్శకుడు నాకు సర్ది చెప్పాడు. ఈ పాట కూడా పెద్ద హిట్టవుతుందని కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఆయన నమ్మకం చూసి ‘ఆజ్ కీ రాత్’ పాట చేశా. అది కూడా పెద్ద హిట్టయింది” అని తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
‘ఆజ్ కీ రాత్’ ట్యూన్ పరంగా ‘కావాలయ్యా’ రేంజిలో ఉండదు కానీ.. తమన్నా మాత్రం ఈ పాటలోనూ సూపర్ సెక్సీగా కనిపించడంతో పాటు అదిరిపోయే స్టెప్పులు వేసి అది పెద్ద హిట్ కావడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పాటకు సోషల్ మీడియాలో 200 మిలియన్ వ్యూస్‌కు పైగానే రావడం విశేషం. ‘స్త్రీ-2’కు కూడా ఈ పాట పెద్ద ప్లస్ అయి రూ.500 కోట్ల వసూళ్ల మార్కును అందుకుంటోంది.
This post was last modified on September 4, 2024 9:31 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…