ఇప్పటిదాకా దేవర నుంచి ప్రమోషనల్ కంటెంట్ సీరియస్ టోన్ లోనే సాగింది. టైటిల్ సాంగ్ మొత్తం ఎలివేషన్లతో నిండిపోగా సుట్టమల్లె పాట సాఫ్ట్ మెలోడీగా ఛార్ట్ బస్టరయ్యింది. అయితే ఈ రెండింటిలో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్ చూసే ఛాన్స్ అభిమనులకు దక్కలేదు. ఆ కొరత దావూది తీరుస్తుందని ముందు నుంచి చెబుతూనే వచ్చారు. అయితే లిరికల్ కు బదులు రెండు నిమిషాలకు పైగా సాగే వీడియో సాంగ్ ని రిలీజ్ చేయడం ద్వారా దేవర టీమ్ వేసిన ఎత్తుగడ ఒక్కసారిగా అంచనాలను మార్చేసింది. తారక్ ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ చూసి ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
నిజానికి ఊహించిన దానికన్నా ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడి స్క్రీన్ మీద కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇప్పటిదాకా బాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి నృత్యాలు చేయడానికి అవకాశం దొరకని ఈ జూనియర్ శ్రీదేవికి దర్శకుడు కొరటాల శివ సరైన పాత్రే ఇచ్చారు. ముఖ్యంగా ఆ అమ్మాయిలోని గ్లామర్, గ్రేస్ ని పూర్తిగా వాడుకున్న క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక సినిమాలో ఎలా ఉంటుందోననే డౌట్స్ అక్కర్లేదు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ క్యాచీగా సాగగా మొత్తం ఇంటీరియర్ లో తీసినప్పటికీ భారీతనం ఉట్టిపడుతోంది. కొరియోగ్రఫీ కూడా బాగా కుదిరింది.
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1కి సంబంధించిన ప్రమోషన్ స్పీడ్ ఇకపై పెంచబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వరద తాకిడి ఉన్నప్పటికీ సమయం తక్కువగా ఉండటంతో ముందే ప్లాన్ చేసుకున్న పబ్లిసిటీని మార్చడానికి లేకుండా పోయింది. ఇంకా ఆయుధ పూజ పాట రావాల్సి ఉంది. ఇది చాలా కీలకమని అంటున్నారు. ఇది కూడా క్లిక్ అయితే ఆ తర్వాత రాబోయే ట్రైలర్ తో హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోవచ్చు. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ కు పరిచయమవుతున్న దేవర రెండో భాగం షూటింగ్ వచ్చే ఏడాది మొదలుపెట్టొచ్చని వినికిడి.
This post was last modified on September 5, 2024 9:33 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…