సెప్టెంబర్ 7 విడుదలకు సర్వం సిద్ధం చేసుకున్న జనక అయితే గనకని వాయిదా వేశారు. ఇప్పటికే థియేటర్ల కేటాయింపు జరిగిపోయింది. ముందు రోజు ప్రీమియర్లను ఎక్కడ వేయాలో ప్లాన్ చేసుకున్నారు. ఈలోగా హఠాత్తుగా నిర్ణయం ప్రకటించడంతో మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. తెలుగు రాష్ట్రాలను వరదలు కుదిపేస్తున్న టైంలో జనాలు థియేటర్లకు వచ్చే మూడ్ లో లేరనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేసినట్టు అర్థమవుతోంది కానీ ఇక్కడ దిల్ రాజు టీమ్ ప్రాక్టికల్ గా ఆలోచించడాన్ని మెచ్చుకోవాలి. అసలే ఏడో తేదీ శనివారం. వీకెండ్ కేవలం రెండు రోజులు మాత్రమే దొరుకుంది.
తమకన్నా ముందు వచ్చే ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం, 35 చిన్న కథ కాదు హిట్ టాక్ తెచ్చుకుంటే కనక అది జనకకు ఇబ్బందవుతుంది. పైగా సుహాస్ ఇంకా గ్యారెంటీ ఓపెనర్ గా మారలేదు. సినిమా బాగుందనే టాక్ వస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. మొదటి రోజు వసూళ్లు ఏమంత భారీగా ఉండవు. సో ఇప్పుడున్న పరిస్థితిలో జనాలు వినాయకచవితి పండగ మూడ్ లో ఏ సినిమాని చూస్తారో ముందే చెప్పడం కష్టం. పైగా ప్రీమియర్లలో ఉండే రిస్క్ గురించి దిల్ రాజు ఇటీవలే ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడేదో హడావిడిగా ఓకే అనుకున్నా టాక్ ఏ మాత్రం అటు ఇటు అయినా లేనిపోని చిక్కు.
ఎలా చూసుకున్నా జనక తీసుకున్న నిర్ణయం మంచిదే. కండోమ్ కంపెనీ మీద హీరో కేసు వేసే వెరైటీ పాయింట్ తో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ మీద నమ్మకంతో సుహాస్ ఏకంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నాడు. ఇప్పుడీ వాయిదా తనకూ ప్లస్ అవుతుంది. వీలైతే వచ్చే వారమే ప్లాన్ చేసుకుంటే బెటరేమో. మళ్ళీ సెప్టెంబర్ 27 దేవరతో మొదలుపెట్టి ఇంకో రెండు మూడు వారాలు వరసగా కొత్త రిలీజుల తాకిడి ఉంది. చూడాలి దేనికి ఫిక్సవుతారో. ఇప్పుడీ జనక తప్పుకోవడం 35 చిన్న కథ కాదుకి భలే కలిసి వచ్చేలా ఉంది. ఉన్న కాంపిటీషన్ తగ్గితే అంతకన్నా ఏం కావాలి.