అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని పురస్కరించుకుని ఏఎన్ఆర్ 100 పేరుతో ఆయన నటించిన పది ఆణిముత్యాల్లాంటి బ్లాక్ బస్టర్స్ ని థియేట్రికల్ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్,ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిలిం ఆర్చీవ్స్ అఫ్ ఇండియా, పివిఆర్ ఐనాక్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఈవెంట్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు వరసగా మూడు రోజుల పాటు పది సినిమాలను స్క్రీనింగ్ చేస్తారు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఎవరైనా టికెట్లు కొనుక్కుని ఈ షోలను ఆస్వాదించవచ్చు. పాత ప్రింట్లను ప్రత్యేకంగా రీ స్టోర్ చేసి ప్రదర్శించబోతున్నారు.
దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యా భర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం. మనం ఈ లిస్టులో ఉన్నాయి. అన్ని అల్ టైం మ్యూజికల్ క్లాసిక్సే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దసరా బుల్లోడు లాంటి బ్లాక్ బస్టర్స్ వీటిలో మిస్సయ్యాయి కానీ అలనాటి పాత బంగారాన్ని మళ్ళీ తెరమీద చూసే అవకాశం అరుదుగా వస్తుంది కాబట్టి దీనికి భారీ స్పందన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ లో ఈ మధ్య పది ఇరవై సంవత్సరాల కంటే పాత సినిమాలు చూసే ఛాన్స్ దక్కలేదు. కానీ ఈ ఫెస్టివల్ ప్రత్యేకమని చెప్పాలి.
ఇదే తరహాలో ఎన్టీఆర్ సినిమాలను కూడా ప్రదర్శిస్తే బాగుంటుంది కానీ ఆ దిశగా ఎవరైనా పూనుకుంటే బాగుంటుంది. ఏఎన్ఆర్ ఫెస్టివల్ లో చూపించే చిత్రాలకు నాగార్జున, నాగ చైతన్యతో పాటు కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారట. ఇలాంటి ట్రెండ్ బాలీవుడ్ లో ముందు నుంచి ఉంది. అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, దేవానంద్, యాష్ చోప్రా లాంటి లెజెండ్స్ పాత సినిమాలను కొత్తగా మాస్టర్ చేసి గొప్ప అనుభూతి ఇవ్వడం అక్కడ రెగ్యులర్ గా పాటిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఏఎన్ఆర్ తో మొదలుపెట్టారు కనక రాబోయే రోజుల్లో కూడా ఇవి కొనసాగితే కొత్త తరానికి క్లాసిక్స్ పరిచయమవుతాయి.
This post was last modified on September 4, 2024 11:14 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…